Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘యుగానికొక్కడు-2’ అతడే ధనుష్..!

‘యుగానికొక్కడు-2’ అతడే ధనుష్..!

‘ఆయిరతిల్ ఒరువన్..’ (యుగానికి ఒక్కడు) 2010విడుదలైన ఈ మూవీ తమిళ్ తెలుగులో సంచలనం సృష్టించింది. మళ్ళీ పదేళ్ల తర్వాత పార్ట్ 2 వస్తుందని చెప్పడంతో అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. కొత్త సంవత్సరం రోజున దర్శకుడు సెల్వ రాఘవన్ రిలీజ్ చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది.

అయితే.. ఈ సీక్వెల్ లో మొదటి పార్ట్ లో నటించిన కార్తీకి బదులు ధనుష్ ను తీసుకున్నాడు డైరెక్టర్. ఎందుకిలా తీసుకున్నాడు..? కథానుసారమే హీరోను మార్చాడా? మరేదైనా కారణం ఉందా? అనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడింది.

కథానుసారమే ధనుష్ ను తీసుకున్నాడట డైరెక్టర్. ‘యుగానికి ఒక్కడు’ చిత్రం మొదటి పార్ట్ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడే సీక్వెల్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. మొదటి పార్టులో హీరో కార్తీ చోళ యువరాజు అయిన బాలుడిని పాండ్యాల నుంచి కాపాడి భుజాన వేసుకొని అడవుల్లోకి వెళ్లిపోతాడు గుర్తుందా? ఆ బాలుడే ఇప్పుడు ధనుష్ రూపంలో పెరిగి పెద్దవాడు అవుతాడన్నమాట. సో.. ఆ బాలుడి పాత్రను ధనుష్ పోషించబోతున్నట్టు సమాచారం.

అయితే.. ఇక్కడే మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఉంది. తొలి భాగంలో హీరో కార్తీదే మెయిన్ రోల్. మరి అలాంటి పాత్రను దర్శకుడు ఎలా ముగించబోతున్నాడు అనేది కీలకం. ఎలాంటి ట్విస్టుతో ఈ పాత్రను ఎండ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

తమిళ్ లో విలక్షణ దర్శకుడిగా పేరుగాంచిన సెల్వరాఘవన్ చిత్రాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. 7/జి బృందావన కాలనీ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇక ‘యుగానికి ఒక్కడు’ మూవీ మాసివ్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో.. సీక్వెల్ కోసం కూడా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

‘ఆయిరతిల్ ఒరువన్-2’ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించబోతున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరవింద్ కృష్ణ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. 2024లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Share via
Copy link