Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రేయసితో యంగ్ హీరో పెళ్లి.. సంగీత్ లో రచ్చ రచ్చ!

ప్రేయసితో యంగ్ హీరో పెళ్లి.. సంగీత్ లో రచ్చ రచ్చ!

యంగ్ హీరో వరుణ్ ధావన్ తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్ ని పెళ్లాడేస్తున్నాడు. 24 జనవరి (నేడు) దివ్య ముహూర్తాన ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. ఇన్నాళ్లు పెళ్లి కార్డ్ అయినా ఇవ్వకుండా ఎంతో గుట్టుగా విషయాన్ని దాచి పెట్టినా.. ప్రకటనలతో ఆర్భాటం ఏదీ లేకుండానే ఈ పెళ్లి వేడుక నేడు ముంబైలో జరగనుంది. తాజాగా వారి సంగీత వేడుక నుండి మొదటి ఫోటోలు విడుదలయ్యాయి.

వరుణ్ ధావన్- నటాషా దలాల్ ఫుల్ సెలబ్రేషన్ మోడ్ లో కనిపిస్తున్నారు. గత రెండ్రోజులుగా ఆ ఇద్దరూ బ్యాచిలరొట్టే పార్టీలతో ఫుల్ బిజీగా ఉన్నారని ఇంతకుముందే రిలీజైన ఫోటోలు వీడియోలు వెల్లడించాయి.

ఈ జంట వివాహం ముంబై అలీబాగ్ లోని విలాసవంతమైన రిసార్ట్ `ది మాన్షన్ హౌస్`లో జరుగుతోంది. సంగీత్ లో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న ధావన్ బోయ్ స్నేహితులు .. కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. వాటన్నిటినీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో వరుణ్ ధావన్ పక్కన ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా .. వరుణ్ అన్నయ్య రోహిత్… నిర్మాత కునాల్ కోహ్లీ కూడా కెమెరాకు పోజులిచ్చారు.

అలాగే వధువు నటాషా కొన్ని అందమైన ఫోటోల్ని వేదిక వద్ద నుంచి ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. వీటిలో నటాషా ఎంతో ముద్దొచ్చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రసిద్ధ మెహందీ కళాకారిణి వీణా నాగ్డా కూడా వరుణ్ ధావన్ వివాహ వేదికకు వచ్చారు.

అతిథులకు భద్రత ఘనంగా ఏర్పాటు చేశారు. అలీభాగ్ లో భద్రతను కఠినంగా ఉంచామని.. ఫోటోలు కూడా లీక్ అవ్వకుండా అతిథులు సెల్ ఫోన్ లను ఉపయోగించవద్దని సిబ్బందిని కోరినట్లు చెబుతున్నారు. కోవిడ్19 భద్రతా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిశ్రమకు చెందిన కొంతమందిని మాత్రమే ఆహ్వానించారట. నిజానికి మహమ్మారీ కారణంగా వాయిదా పడిన ఈ పెళ్లి నేడు పరిమితుల నడుమ జరుగుతోంది.

Share via
Copy link