Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత ”వకీల్ సాబ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు – బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఇది ‘పింక్’ చిత్రానికి రీమేక్. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ సినిమాకి బజ్ క్రియేట్ చేయడానికి భారీ ప్రమోషన్స్ ఎందుకులే అనుకున్నారో ఏమో.. మేకర్స్ ఇంతవరకు పెద్దగా సౌండ్ చేయలేదు. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సినిమాని ఆడియన్స్ కు దగ్గర చేసేది ప్రమోషన్స్ అనే విషయం తెలిసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట.

హైదరాబాద్ లోని యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో ఏప్రిల్ 3న గ్రాండ్ గా ఈ ఈవెంట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. మాములుగా పవన్ సినిమాల ఫంక్షన్స్ కి వేరే గెస్టులు కూడా అవసరం ఉండదు. మరి ఈ ఫంక్షన్ ని చిత్ర యూనిట్ మరియు అభిమానుల మధ్యలో నిర్వహిస్తారా లేదా ఎవరైనా స్పెషల్ గెస్ట్ ని పిలుస్తారా అనేది చూడాలి. కాగా పవన్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు ట్రేడ్ టాక్. ఏప్రిల్ 9 మొదలుకొని ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు ‘వకీల్ సాబ్’ కు తిరిగే ఉండదని చెప్పొచ్చు. మరి ‘అజ్ఞాత వాసి’ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share via
Copy link