Templates by BIGtheme NET
Home >> Cinema News >> రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు

రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సినీ ప్రముఖల అరంగేంట్రంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజాగా మరో హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు స్వయంగా సంకేతాలు పంపటం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది మే చివరినాటికి తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఇందుకనే రాజకీయపార్టీల్లో బాగా యాక్టివ్ గా ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే డిసెంబర్ మొదటివారంలో తలైవా రజనీకాంత్ తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి కలకలం రేపారు.

డిసెంబర్ 31వ తేదీన తన రాజకీయపార్టీ పేరు చిహ్నం విధివిధానలన్నింటినీ ప్రకటించబోతున్నట్లు రజనీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్లే తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరికి పార్టీ ఏర్పాటు ప్రక్రియను రజనీ అప్పగించారు. దీనికి అదనంగా గతంలోనే పార్టీ ఏర్పాటు చేసిన మరో సినీనటుడు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్న విషయం అందరు చూస్తున్నదే. వీళ్ళద్దరు కాకుండా విజయకాంత్ కూడా చాలాకాలంగా రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు.

వీళ్ళకి అదనంగా తొందరలో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఆదివారం చెన్నై శివార్లలోని పనయూరు ప్రాంతంలో ఉన్న ఫాంహౌస్ లో విజయ తన అభిమాన సంఘాల్లోని కీలక వ్యక్తులతో సమావేశం జరిపారు. గడచిన పదేళ్ళుగా విజయ్ ‘మక్కల్ ఇయక్కం’ పేరుతో ఓ స్వచ్చంద సంస్దను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మక్కల్ ఇయక్కం స్వచ్చంద సంస్ధ అంటే తమిళనాడులో బాగా పాపులర్. కాబట్టి ఇదే పేరును మరింత జనాల్లో తీసుకెళ్ళాలని తాను నిర్ణయించినట్లు విజయ్ భేటిలో స్పష్టం చేశారు. గతంలో జయప్రకాష్ నారాయణ ఏపీలో కూడా ఇలాగే చేశారు. లోక్ సత్తా బాగా జనాల్లోకి వెళ్లింది కాబట్టి అదే పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు. విజయ్ కూడా అదే రూట్లో నడుస్తున్నారు. మరి ఈ మోడల్ విజయ్ కి అయినా కలిసొస్తుందో లేదో చూడాలి.

నిజానికి విజయ్ ను రాజకీయాల్లోకి రావాలంటు చాలా సంవత్సరాలుగా అభిమాన సంఘాల నేతలు ఒత్తిడి పెడుతున్నారు. విజయ్ కూడా తొందరలోనే వస్తానంటు ఎప్పటికప్పుడు వాళ్ళకు సమాధానమిస్తున్నారు. చెప్పటమే కానీ ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిందే లేకపోవటంతో అభిమానుల్లో బాగా అసంతృప్తి పెరిగిపోతోంది. ఇదే విషయం ఆదివారం నాటి భేటిలో బయటపడింది. దాంతో విజయ్ స్పందిస్తు తన అభిమానులెవరు ఇతర పార్టీల్లో చేరవద్దని విజ్ఞప్తి చేశారు. తన అభిమానుల కోరిక తొందరలోనే నెరవేరబోతున్నట్లు విజయ్ స్పష్టంగా ప్రకటించారు. దాంతో విజయ్ కూడా తొందరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న విషయం స్పష్టమైపోయింది.

Share via
Copy link