Templates by BIGtheme NET
Home >> Cinema News >> వకీల్ సాబ్ న్యూ ఇయర్ గిఫ్ట్

వకీల్ సాబ్ న్యూ ఇయర్ గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న న్యూ ఇయర్ గిఫ్ట్ రానే వచ్చింది. పవన్ నటిస్తున్న కొత్త చిత్రం వకీల్ సాబ్ నుండి అసలు సిసలైన ఫస్ట్ లుక్ వచ్చి అదిరిపోయే గిఫ్ట్ అందించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా , దిల్ రాజు , బోణి కపూర్ లు నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా షూటింగ్ పూర్తి కావడం తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా బైక్ నడిపిస్తుండగా..పవన్ వెనుకాల శృతి హాసన్ కూర్చుంది. అలాగే ఈ పోస్టర్ ఫై ఫస్ట్ లుక్ టీజర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నలు తెలిపారు. మొత్తం మీద ఈ పోస్టర్ తో ఇంతకాలంగా ఎదురుచూసిన ఎదురుచూపులు తెరపడినట్లు అయ్యింది.

Share via
Copy link