Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘కంటిపాపా కంటిపాపా’ అంటూ ప్రేమ గీతం పాడుకుంటున్న ‘వకీల్ సాబ్’..!

‘కంటిపాపా కంటిపాపా’ అంటూ ప్రేమ గీతం పాడుకుంటున్న ‘వకీల్ సాబ్’..!

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ”వకీల్ సాబ్”. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హిందీ ‘పింక్’ చిత్రానికి రీమేక్. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్.. మార్చి మ్యూజిక్ ఫెస్ట్ అంటూ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’ ‘సత్యమేవ జయతే’ పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘కంటిపాపా కంటిపాప’ అనే మూడో పాట లిరికల్ వీడియోని విడుదల చేశారు.

‘కంటిపాపా కంటిపాపా.. చెప్పనైన లేదే.. నువ్వు అంతలా అలా ఎన్ని కలలు కన్నా.. కాలి మువ్వా కాలి మువ్వా సవ్వడైన లేదే’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. థమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్ – దీపు కలసి ఆలపించారు. దీనికి రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యం అందించారు. ఇందులో పవన్ – హీరోయిన్ శృతి హాసన్ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ లో కాలేజ్ ఎపిసోడ్ లో వచ్చే సాంగ్ అని తెలుస్తోంది. దీంట్లో పవన్ – శృతి కెమిస్ట్రీ బాగా కుదిరింది. పవన్ లుక్స్ అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Share via
Copy link