Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఒకేరోజు రిలీజ్ అవుతున్న ఇస్మార్ట్ బ్యూటీ నటించిన రెండు సినిమాలు..!

ఒకేరోజు రిలీజ్ అవుతున్న ఇస్మార్ట్ బ్యూటీ నటించిన రెండు సినిమాలు..!

బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్.. పూర్తిగా సౌత్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘మున్నా మైఖేల్’ ప్లాప్ తర్వాత హిందీలో మరో ఆఫర్ అందుకోని నిధి.. అక్కినేని నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో మెరిసింది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇస్మార్ట్ బ్యూటీగా మారిపోయింది నిధి. దీంతో కోలీవుడ్ కూడా అమ్మడిపై ద్రుష్టి సారించింది. తమిళ్ లో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది నిధి అగర్వాల్. అయితే ఇప్పుడు ఇస్మార్ట్ బ్యూటీ నటించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

జయం రవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ”భూమి” లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇది ఆమెకు తమిళ్ డెబ్యూ మూవీ. ‘జయం’ రవి కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోమ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుజాత విజయ్ కుమార్ నిర్మించారు. రైతు సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ కి విక్రయించారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ‘భూమి’ చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్ కి దక్కించుకుంది. ఈ చిత్రాన్ని పొంగల్ కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు డిస్నీ+హాట్ స్టార్ ప్రకటించింది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ అవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా అని .

కోలీవుడ్ హీరో శింబు నటించిన తాజా చిత్రం ‘ఈశ్వరన్’ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ – కేవీ దురై బ్యానర్స్ పై నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ విధంగా నిధి అగర్వాల్ నటించిన రెండు తమిళ్ సినిమాలు కూడా ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాకపోతే ‘భూమి’ ఓటీటీలో రిలీజ్ అవుతుండగా.. ‘ఈశ్వరన్’ థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఏదేమైనా నిధి కోలీవుడ్ లో పాగా వేయడానికి ఈ రెండు సినిమాలు కీలకం కానున్నాయి.

Share via
Copy link