Templates by BIGtheme NET
Home >> Cinema News >> త్రివిక్రమ్ లో కట్ట తెగిన ఉద్వేగం.. కారణమిదే..!

త్రివిక్రమ్ లో కట్ట తెగిన ఉద్వేగం.. కారణమిదే..!

2020 ఎందరికో పీడకలల్ని పరిచయం చేస్తే.. ఇదే ఏడాది మాటల మాంత్రికుడు .. దర్శకుడు త్రివిక్రమ్ కి తీపి జ్ఞాపకాల్ని అందించింది. మాయావికి తీపి కలలకు ఆస్కారం కల్పించింది. ఆ సంగతి అల వైకుంఠపురములో మొదటి వార్షికోత్సవంలో మరోసారి రుజువైంది. ఈ వేదికపై మాట్లాడిన త్రివిక్రమ్ లో ఉద్వేగం కట్టలు తెంచుకుంది.

త్రివిక్రమ్ అలా వైకుంటపురం లో ఎలా మొదలైందో ప్రారంభించి ఈ సినిమా తీయమని తనను ప్రోత్సహించిన అల్లు అరవింద్ బన్నీ వాస్ ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణాన్ని ప్రేమకథతో పోల్చినప్పుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో అన్ని అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

అల.. మొదలైన తీరు.. రకరకాల సందర్భాల్లో ఎమోషన్స్ గురించి త్రివిక్రమ్ వార్షికోత్సవ వేదికపై గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటి
టబు మొదటిసారి సెట్స్ లోకి అడుగుపెట్టినప్పుడు… ఎస్.ఎస్. తమన్ `సామజవరాగమన..` మొదటి వెర్షన్ వయోలిన్ ట్యూన్.. బాబీ ఒక సన్నివేశాన్ని రీషూట్ చేయమని అడిగిన సందర్భాన్ని.. ఈశ్వరి రావుతో మరపురాని మొదటి షాట్.. విశ్రాంతికి ముందు ఉద్రిక్త షూటింగ్ క్షణాలు.. పారిస్ లో షూటింగ్ గురించి పూజాతో చెప్పిన సమయం … సెట్లో ప్రొడక్షన్ టీమ్.. ల్యాబ్ లో టెక్నీషియన్స్ టీమ్ తో అలయెన్స్.. ఇలా ఎన్నో జ్ఞాపకాల్ని తరచి తరచి గుర్తుకు తెచ్చుకున్నారు.

“ఇది కొత్త జంట వివాహ ఆల్బమ్ లాంటిది“ అంటూ ఛమత్కరించారు త్రివిక్రముడు. “వారు చూడకూడదనుకున్నా అది అందరికీ చూపించేది“ అంటూ తనదైన మార్క్ పంచ్ లు వేశాడు వేదికపై. నవ్వుతూ నవ్విస్తూ ఎమోషనల్ స్పీచ్ తో అదరగొట్టాడు. జెమిని టీవీకి మరో `అతడు` అని.. ఎవిపిఎల్ బృందం సినిమా గురించి మాట్లాడటం మానేసినప్పటికీ వారు దానిని పదే పదే చూపిస్తారని అన్నారు. ఈ హింస కొనసాగుతోందని త్రివిక్రమ్ సరదాగా పంచ్ లు వేశారు. సాంకేతిక నిపుణులు మొదలు చిత్రబృందంలో ప్రతి ఒక్కరినీ త్రివిక్రమ్ ఈ వేదికపై ప్రశంసించారు. నటీనటుల్ని పదే పదే గుర్తు చేసుకున్నారు. సిత్తరాలా సిరపాడు పాటకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సముథిరాకనితో `లవ్ యు సార్` అంటూ సరదాగా పరాచికం ఆడారు త్రివిక్రమ్. మొత్తానికి త్రివిక్రమ్ లో కట్ట తెగిన ఉద్వేగం.. ఫిలింవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వేదికపై బన్ని.. పూజా.. అల్లు అరవింద్ తదితరులు ఉన్నారు.

Share via
Copy link