Templates by BIGtheme NET
Home >> Cinema News >> డార్లింగ్ ఇమేజ్ కి ఆ రెండు డ్యామేజ్!

డార్లింగ్ ఇమేజ్ కి ఆ రెండు డ్యామేజ్!

ప్రభాస్ నటించిన `సాహో `..` రాధే శ్యామ్` చిత్రాలు వరుసగా వైఫల్యాలు చెందడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో పరాజయం చెందడమే కాకుండా బుల్లితెర అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసాయి. `సాహో` హిందీ బెల్డ్ లో పర్వాలేదనిపించినా తెలుగులో మాత్రం పూర్తిగా ప్రతికూలమైన స్థితిలోకే జారుకుంది.

ఇక `రాధే శ్యామ్` తెలుగుతో పాటు.. హిందీలోనూ పరాజయం మూటగట్టుకుంది. ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసినప్పటికీ నిర్మాతలు – పంపిణీదారులకు నష్టాలు తప్పలేదు. తాజగా గత ఆదివారం రాధే శ్యామ్ తొలిసారి `జీ` తెలుగులో ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని జీ బుల్లి తెరపై గట్టిగానే ప్రమోట్ చేసింది. భీమవరంలో `రాధే శ్యామ్` థీమ్ పార్క్ పేరుతో ప్రచారం కూడా చేసారు.

దీంతో ఈ సినిమా ప్రీమియర్ షోను చూసేందుకు ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని శాటిలైట్ ఛానెల్ యాజమాన్యం అంచనా వేసింది. తద్వారా మంచి టీఆర్పీ నెంబర్ కూడా సొంతం చేసుకోవచ్చని సదరు ఛానెల్ బోలెడన్ని ఆఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా బుల్లి తెరపైనా పెద్ద షాక్ ఇచ్చింది.

బుల్లితెర ప్రేక్షకులను కూడా `రాధేశ్యామ్` ఆకట్టుకోలేకపోయిందని టీఆర్ పీని బట్టే తెలుస్తోంది. `రాధే శ్యామ్` మొదటి సారి ప్రీమియర్ కోసం 8.25 టీఆర్ పీ దక్కింది. ఇంతకుముందు `వకీల్ సాబ్` 19 – `బంగార్రాజు` 14 నెంబర్ టీఆర్ పీతో బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించడంలో ముందు వరుసలో ఉన్నాయి. వాటిని `రాధేశ్యామ్` బీట్ చేస్తుందని టీమ్ అంచనా వేసింది. కానీ `రాధే శ్యామ్` కంటే దాదాపు రెట్టింపు టీఆర్ పీతో తోనే ఆ చిత్రాలు మంచి ఫలితాలు సాధించినట్లు తెలుస్తోంది.

ఈ నెంబర్లను బట్టి ప్రభాస్ సినిమాతో పోలిస్తే నాగ్ సినిమానే బెటర్ పొజిషన్ లో ఉందని తెలుస్తోంది. సరిగ్గా `సాహో` విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అప్పట్లో `సాహో` 5.81 స్కోర్ చేయగా.. అదే సమయంలో ప్రీమియర్ అయిన `గుణ369` 5.91 స్కోర్ చేసింది. ఆరకంగా ప్రభాస్ రెండు సినిమాల వైఫల్యాలు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని ఎంతగా వీక్ చేసాయో తేట తెల్లమవుతోంది.

Share via
Copy link