Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈసారి ఎవరూ సేఫ్ కాదంటున్న సామ్.. ఉగ్రవాదిగా మెప్పిస్తుందా??

ఈసారి ఎవరూ సేఫ్ కాదంటున్న సామ్.. ఉగ్రవాదిగా మెప్పిస్తుందా??

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ వాజ్పేయి ప్రధాన పాత్రలో నటించిన పాపులర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. అమెజాన్ ప్రైమ్ వేదికగా 2019 సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థకు ఏజెంట్గా పనిచేసే పాత్రలో మనోజ్ కనిపించాడు. ఇంకా ప్రియమణి నీరజ్ మాధవ్ పవన్ చోప్రా కిషోర్ కుమార్ కీలకపాత్రలు పోషించడం జరిగింది. తాజాగా దీనికి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఇందులో సమంత నెగటివ్ రోల్ లో నటించబోతున్నారని దర్శకుడు రాజ్ నిడిమోరు డీకే కృష్ణ గతంలోనే ప్రకటించారు. అంతేకాకుండా సమంత పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలిపారు. ఆ తర్వాత సమంత ఇంస్టాగ్రామ్ లో స్పందించి.. ‘నేను నటించబోతున్న మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2′.

దీని కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నా డ్రీమ్ రోల్ నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు’ అని సమంత తెలిపింది. అంటే నెగటివ్ రోల్ చేయడం సమంత డ్రీమ్ రోల్ అన్నమాట. ఇక తాజాగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ -2 ప్రోమో.. ట్విట్టర్ వేదికగా స్వయంగా విడుదల చేసింది సమంత. అలాగే ఈ సీసన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ కూడా ప్రకటించింది. హిందీతో పాటు తెలుగు తమిళ బాషలలో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. అయితే సమంత క్యారెక్టర్ కి సంబంధించిన ఈ ప్రోమోలో.. ‘ఈసారి ఎవరు తప్పించుకోలేరు. వెనకాల కనిపిస్తోన్న ముఖంలో రహస్యమంతా దాగి ఉంది’ అనే వర్డ్స్ ఇంటరెస్ట్ కలిగిస్తున్నాయి. ఈ లెక్కన ఈ వెబ్ సిరీస్లో సమంత ఉగ్రవాదిగా కనిపించనుంది అనేది నిజమే అనిపిస్తుంది. ఇక ఫిబ్రవరి 12న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుండగా.. ఈ సంక్రాంతికి పూర్తి ట్రైలర్ విడుదల చేస్తారని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి హీరోయిన్ గా మెప్పించిన సామ్.. ఉగ్రవాదిగా ఎలా భయపెట్టనుందో..!!

Share via
Copy link