Templates by BIGtheme NET
Home >> Cinema News >> బికినీ బీచ్ లో తారా ..

బికినీ బీచ్ లో తారా ..

ఇటీవలే మాల్దీవుల విహారంలో స్టన్నింగ్ ఫోజులతో గుబులు రేపింది తారా సుతారియా. వరుసగా బికినీ బీచ్ సెలబ్రేషన్ నుంచి ఫోటోల్ని షేర్ చేసింది. ఇప్పుడు మరోసారి గోవా బీచ్ నుంచి సేమ్ ట్రీట్. తారా మరోసారి బీచ్ బికినీతో చెలరేగింది. అందుకు సంబంధించిన ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. తారా గతంలోకి వెళితే.. 2010 లో బిగ్ బడా బూమ్ అనే టీవీ షోతో బాల నటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తరువాత `ది సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ అండ్ కబీర్.. ఓయ్ జాస్సీ వంటి షోలలో కనిపించింది. స్వతహాగా గాయని కూడా అయిన ఈ బ్యూటీ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` లో నటించి ఆరంగేట్రమే బాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. తారాలో ఏదో గమ్మత్తయిన మ్యాటర్ ఉందని ప్రశంసలు కురిసాయి. ఆ తర్వాత మార్జావాన్ అనే యాక్షన్ చిత్రంలో కూడా కనిపించింది ఈ కుర్రబ్యూటీ.

తారా ఇప్పటికిప్పుడు రెండు చిత్రాల్లో నటిస్తోంది. తడాప్ .. ఏక్ విలన్ 2 లాంటి క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తడాప్ ని మిలన్ లుథ్రియా తెలుగు హిట్ `ఆర్.ఎక్స్ 100` రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ లోకి స్టార్ హీరో సునీల్ శెట్టి కుమారుడు అహాన్ తెరంగేట్రం చేస్తున్నారు. మోహిత్ సూరి – ఏక్ విలన్ 2 లో జాన్ అబ్రహం- దిషా పటాని- ఆదిత్య రాయ్ కపూర్ లతో కలిసి నటిస్తోంది. టైగర్ ష్రాఫ్ `హీరో పంథి` సీక్వెల్లోనూ కథానాయికగా నటిస్తుండగా.. కొరియోగ్రాఫర్-దర్శకుడు అహ్మద్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Share via
Copy link