Templates by BIGtheme NET
Home >> Cinema News >> సితా పాపతో తమన్నా చెలిమి

సితా పాపతో తమన్నా చెలిమి

ఆలియా .. తమన్నా.. కాజల్.. రష్మిక… వీళ్లంతా మహేష్ కి స్నేహితులు అవునో కాదో కానీ సితారకు మాత్రం మంచి ఫ్రెండ్స్. మొన్ననే ఆర్.ఆర్.ఆర్ సీతగా దర్శనమిచ్చిన ఆలియాతో ఫ్రెండ్షిప్ చేసిన సీతాపాప .. తమన్నాతోనూ అంతే గొప్ప బాండింగ్ ని కొనసాగిస్తూ కనిపించింది.

ప్రస్తుతం మహేష్ – తమన్నా జంటపై కమర్షియల్ యాడ్ షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ వంగా నిర్ధేశనంలో ఈ ప్రకటన రూపొందుతోంది. ఆన్ లొకేషన్ తమన్నా ఇలా ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ డిజైనర్ డ్రెస్ లో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. ఇక ఇదే షూటింగ్ పరిసరాల్లో సితార కూడా సందడి చేసింది. అక్కడ తమన్నా తో ఇలా ఫోటో దిగి సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది.

నిజానికి తమన్నా మహేష్ తో నటించడం ఇదే తొలిసారి కాదు. దూకుడు- ఆగడు చిత్రాల్లోనూ నటించింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనూ మహేష్ తో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. అప్పటి నుంచి సితార తో స్నేహం కొనసాగుతోంది. పాపా మహేష్ కథానాయికలతో చక్కని బాండింగ్ కొనసాగిస్తున్న సితార కూడా పెద్ద స్టార్ అవుతుందేమో చూడాలి.

Share via
Copy link