Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘హగ్ లు వద్దులే.. అసలే చలికాలం’

‘హగ్ లు వద్దులే.. అసలే చలికాలం’

లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుమంత్. ఫస్ట్ సినిమా ‘ప్రేమకథ’లో మంచి నటన కనబరిచి ఆకట్టుకున్న సుమంత్.. అప్పటి నుంచి విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ‘సత్యం’ ‘గౌరీ’ ‘మధుమాసం’ ‘గోదావరి’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘మళ్లీ రావా’ వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. గత ఏడాది ‘ఎన్టీఆర్ బయోపిక్’ రెండు భాగాల్లో తన తాత ఏఎన్నార్ పాత్రను పోషించి ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో ‘కపటధారి’ అనే ఎమోషనల్ థ్రిల్లర్ తో వస్తున్నాడు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మించారు. కన్నడ హిట్ సినిమా ‘కవలధారి’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ తో కలిసి తాజాగా ఓ చిట్ చాట్ షోలో పాల్గొన్న సుమంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కమెడియన్ హర్షతో ‘తమాషా విత్ హర్షా’ అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో పలువురు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి ‘కపటధారి’ హీరోయిన్ నందితా శ్వేతతో కలిసి హాజరయ్యాడు సుమంత్. సినిమాల విషయాలతో పాటు యాంకర్ హర్షాతో కలిసి సందడి చేశారు. ‘ధన51’ సినిమా ఎన్ని పెగ్గులేసి ఓకే చేశారు సర్ అని హర్ష అడుగగా.. ‘ఆ సినిమాలో నటించేటప్పుడు వేయాల్సింది’ అని సుమంత్ చెప్పారు. అలానే ఓ సందర్భంలో హర్ష ‘మీరు కావాలంటే హగ్ చేసుకోవచ్చు’ అని అనడంతో దీనికి స్పందించిన సుమంత్.. ‘మన హగ్గులు కొంచెం.. ఆగవు.. వద్దులే.. అసలే చలికాలం’ అంటూ నవ్వుతూ అన్నాడు.

https://www.youtube.com/watch?v=bCscKEo13vI

Share via
Copy link