Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘సలార్’ లో నటించే స్టార్ క్యాస్టింగ్ వీళ్లేనా..?

‘సలార్’ లో నటించే స్టార్ క్యాస్టింగ్ వీళ్లేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించనున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్’ అంటూ విడుదల చేసిన ‘సలార్’ టైటిల్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి డైలీ ఏదొక రూమర్ వస్తూనే ఉంది. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ఇతర ఇండస్ట్రీలకి చెందిన నటీనటులను తీసుకోవాలని చేస్తున్నారని సమాచారం.

ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటించనుందట. అలానే ఓ కీలక పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని సంప్రదిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక తమిళ్ యాక్టర్స్ విజయ్ సేతుపతి – సముద్రఖని వంటి హీరోలు కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ‘బాహుబలి’ కో స్టార్ దగ్గుబాటి రానా కూడా నటించనున్నాడట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఈ చిత్రంలో చాలామంది కొత్త వారికి కనిపించబోతున్నారు. ఇప్పటికే నటీనటుల కోసం అన్ని వయసుల వారిని ఆడిషన్స్ నిర్వహించారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని వచ్చే జనవరిలో స్టార్ట్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. అయితే ప్రశాంత్ నీల్ కేవలం నాలుగు నెలల్లో ‘సలార్’ షూటింగ్ పూర్తి చేసి 2021 లోనే విడుదల చేసేలా ప్లాన్స్ చేసుకుంటున్నారట. మరి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలాంటి సంచలనాలు నమోదు చేయబోతుందో చూడాలి.

Share via
Copy link