Templates by BIGtheme NET
Home >> Cinema News >> దగ్గుబాటి వారి కోడలు ధరించిన లెహంగా ప్రత్యేకతలివే…!

దగ్గుబాటి వారి కోడలు ధరించిన లెహంగా ప్రత్యేకతలివే…!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ఒకడైన దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటివాడయ్యారు. హైదరాబాద్ నగరంలోని రామానాయుడు స్టూడియోలో జరిగిన వివాహ వేడుక జరుగగా.. శనివారం రాత్రి గం.8.45ని.ల సమయంలో తన ప్రేయసి మిహిక మెడలో మూడు ముళ్లు వేశారు రానా. కరోనా నేపథ్యంలో ఈ శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్దిమంది అతిథులు సన్నిహితుల మధ్య వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్ళిలో అక్కినేని నాగ చైతన్య – సమంత జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక టాలీవుడ్ నుంచి రానా స్నేహితులు రామ్ చరణ్ – అల్లు అర్జున్ లు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.. మిగిలిన వారు వీఆర్ కిట్స్ ద్వారా పెళ్లిని ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో అందరి దృష్టి నవ వధువు మిహికా ధరించిన లెహంగాపై పడింది. అద్భుతంగా డిజైన్ చేయబడిన దగ్గుబాటి వారి కోడలి లెహంగాపై ఆరాలు తీయడం స్టార్ట్ చేసారు.

కాగా గోల్డ్ మరియు క్రీమ్ కలర్ లో ఎంతో అందంగా ఉన్న లెహంగా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. మిహికా ధరించిన లెహంగాని ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిందని తెలుస్తోంది. ఈ లెహంగా రెడీ చేయడానికి సుమారు పది వేల గంటల సమయం వెచ్చించాల్సి వచ్చిందని డిజైనర్ అనామిక ఖన్నా వెల్లడించారు. హ్యాండ్ ఎంబ్రాయిడీతోనే దీన్ని కుట్టినట్లు అనామిక వివరించారు. లెహంగాలోని డిజైన్లను చికంకరి మరియు బంగారు లోహంతో చేశారట. లెహెంగా కోసం బంగారు నేసిన దుపట్ట కూడా ఉంది. దీని ధర సుమారు రూ.7 లక్షలు దాకా ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా కొత్త జంట రానా – మిహిక లకు సినీ ప్రముఖులు విషెష్ అందిస్తున్నారు.

Share via
Copy link