Templates by BIGtheme NET
Home >> Cinema News >> స్పార్క్ మరో స్వీట్ మెలోడీ.. రాధేషా

స్పార్క్ మరో స్వీట్ మెలోడీ.. రాధేషా

స్పార్క్ ది L.I.F.E అనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగానే హడావుడి చేస్తున్నాయి. రాబోయే సినిమాల్లో మంచి హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈనెల 17వ తేదీన రాబోతున్న ఈ స్పార్క్ టీజర్ ను కూడా కొన్ని వారాల క్రితం విడుదల చేశారు. పోస్టర్స్ తోనే కాకుండా సాంగ్స్ తో కూడా సినిమాకు బజ్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

సినిమాకు ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ తగ్గకుండా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మూడు పాటలు ఇదివరకే రిలీజ్ అయ్యాయి. ఇక నాలుగవ పాటను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సౌత్ లో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్న హెశమ్ అబ్దుల్ వహబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా విక్రాంత్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.

ఇక గ్లామరస్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా, రుక్సార్ హీరోయిన్స్ గా నటించిన Spark the L.I.F.E లో చాలామంది ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇక రీసెంట్‌గా ఈ సినిమాకు సంబందించిన మరో సాంగ్ విడుదల చేశారు. రాధేశా.. అనే ఈ పాటను హెశమ్ అబ్దుల్ వహబ్ కంపోజ్ చేయగా శ్వేతా మోహన్ ఆలపించారు. ఇక అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించిన రాధేశా.. లో హీరోయిన్ హీరో పై చూపించే ప్రేమతో పాటు ఆమె కృష్ణుడి కోసం వెతికే గోపికల కనిపిస్తోంది.

లిరికల్ సాంగ్ లో మెహ్రీన్ తో పాత్ర బాగా హైలెట్ అయ్యింది. సినిమా టీజర్ తోనే స్పార్క్ సినిమా ఒక డిఫరెంట్ కంటెంట్ తో రాబోతున్నట్లు అర్ధమవుతుంది. విక్రాంత్ పూర్తిగా స్టైలిష్‌ పాత్రలో కనిపించనుండగా.. కాలేజీ విద్యార్థి నుండి ప్రత్యేక ఏజెంట్‌గా అతను ఎలా.మారాడు అనే కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందని సమాచారం. యాక్షన్ తో పాటు మెహ్రీన్ పిర్జాదా మరియు రుక్సార్‌లతో చేసిన మ్యాజికల్ రొమాన్స్ హైలెట్ అవుతుందట.

నిర్మాతలు సినిమా మేకింగ్ విషయంలో రాజీ పడలేదని తెలుస్తోంది. ఇక హేషమ్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు మరొక మేజర్ ప్లస్ పాయింట్. చిత్రానికి డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ దర్శకత్వం వహించగా నాజర్, సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్, సత్య, శ్రీకాంత్, అయ్యంగార్, అన్నపూర్ణమ్మ, రాజా రవీంద్ర వంటి నటీనటులు కూడా సినిమాలో ప్రత్యేకమైన పాత్రలలో నటించారు. స్పార్క్ తెలుగు, తమిళం, హింద్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Share via
Copy link