Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఐఏఎస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి సోనూసూద్ సాయం

ఐఏఎస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి సోనూసూద్ సాయం

మన దేశంలో ప్రతిభ ఉంటే ఆర్థిక స్తోమత ఉండదు. ఆ కారణం వల్ల ఎంతో మంది చదువును మద్యలో వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదుకోవాలంటే పేద వారికి అందని ద్రాక్షే అయ్యింది. పేద వారు ఐఏఎస్ వంటి అత్యున్నత శిక్షణ తరగతులు హాజరు అవ్వడం సాధ్యం కావడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి చదువుకోలేక చిన్న చిన్న ఉద్యోగాలతో సంతృప్తి పడుతున్నారు. అలాంటి వారి కోసం తాను ఉన్నాను అంటూ సోనూసూద్ ఐఏఎస్ స్కాలర్ షిప్ ఇచ్చేందుకు సోనూసూద్ ముందుకు వచ్చాడు. తన తల్లి జ్ఞాపకార్థం ఈ పని చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.

కేవలం ఐఏఎస్ కు మాత్రమే కాకుండా గ్రూప్స్ మరియు సీఏ ట్రైనింగ్ చేసే వారికి కూడా స్కాలర్ షిప్ ఇస్తానంటూ ప్రకటించాడు. అయితే అందుకు గాను వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలు దాటకుండా ఉండాలి. అలాగే చదువులో ప్రతిభను కనబర్చిన వారు అయ్యి ఉండాలి. అంటే ఆర్థికంగా సరిగా లేకున్నా చదువులో ప్రతిభ చూపించిన వారికి ఈ స్కాలర్ షిప్ ను ఇవ్వబోతున్నారు. ఎంత మందికి అయినా ఇది ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం అంటూ ఆయన ప్రకటించాడు. తన వెబ్ సైట్ లో దరకాస్తు చేసుకున్న వారిలో ప్రతి ఒక్క అర్హుడికి కూడా సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు.

లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్ ఆతర్వాత కూడా తన సాయంను కంటిన్యూ చేస్తున్నాడు. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి పేదలకు సాయం చేస్తున్న సోనూసూద్ కొన్ని వేల మందికి రియల్ హీరో అయ్యాడు. ఇప్పుడు ఈ ఐఏఎస్ ప్రోగ్రాం సక్సెస్ అయితే ఆయన దేశంలోనే అత్యున్నత వ్యక్తిగా పేరు దక్కించుకోవడం ఖాయంగా అభిమానులు అనుకుంటున్నారు.

Share via
Copy link