Templates by BIGtheme NET
Home >> Cinema News >> భర్తతో పెదవి ముద్దాటలో మునిగిన స్టార్ హీరోయిన్!!

భర్తతో పెదవి ముద్దాటలో మునిగిన స్టార్ హీరోయిన్!!

కొందరు సెలబ్రిటీలు దశాబ్దాలు గడిచిన ఇండస్ట్రీలో వారికంటూ ప్రత్యేక స్థానం కాపాడుకుంటారు. అలాంటి బ్యూటీలలో ఒకరు శ్రీయ శరణ్. రెండు దశబ్దాలుగా తన అందాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. కెరీర్లో సూపర్ హిట్స్ ప్లాప్స్ అన్ని రుచిచూసిన ఈ భామ.. ముఖ్యంగా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇక కొద్దీకాలం క్రితం పెళ్లి చేసుకున్న శ్రియ.. ప్రస్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తోంది. డెహ్రాడూన్ లో పుట్టి పెరిగింది శ్రీయ. లేడీ శ్రీరామ్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆర్ట్స్ పట్టా పొంది మోడలింగ్ వైపు మళ్ళింది. చిన్నప్పటి నుండే శ్రియ కథక్ డాన్స్ పై మక్కువతో డిగ్రీ చదివేటప్పుడే యాక్టింగ్ అంటే ఇష్టం ఏర్పడిందట. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని తెలుగులో మోస్ట్ బిజీ హీరోయిన్ అయింది అమ్మడు. ‘తుఝే మేరీ కసం’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది.

అంతేగాక తమిళ కన్నడ మలయాళం సినిమాలలో కూడా మెరిసింది. శ్రీయ పెళ్ళైనా కూడా సినిమాలకు గుడ్ బై చెప్పకుండా.. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. కరోనా మహమ్మారి వలన మొన్నటివరకు సినీతారలంతా ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం భర్తతో కలిసి షికారు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా శ్రియ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చింది. తన భర్తతో కలిసి ఒక చెట్టుకింద కూర్చొని లిప్ కిస్ పెట్టుకున్న పిక్ షేర్ చేసింది. తన భర్తను గాడంగా చుంబనంలో మునిగి తేలుతుంది. అంతేగాక అందరికి ఇవే నా న్యూ ఇయర్ కిస్సెస్ అండ్ హగ్స్ అంటూ రాసుకొచ్చింది. భార్యభర్తలు ఇద్దరూ కూడా పార్క్ లో ఎవరిని పట్టించుకోకుండా పెదవి ముద్దాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share via
Copy link