Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ ముంబై భామ మోజులో పడితే అంతే..మరి!

ఈ ముంబై భామ మోజులో పడితే అంతే..మరి!

ముంబై భామ శ్రద్దాదాస్.. అంటే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ముంబైలోనే పుట్టి పెరిగిన ఈ భామ తన విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తి చేసింది. ముంబై యూనివర్సిటీ నుండి మాస్ మీడియా జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. శ్రద్ధాకు చదువుకునే టైంలోనే యాక్టింగ్ వైపు ఇంటరెస్ట్ ఏర్పడిందట. ఇక 2008లో ‘సిద్ధు ఫ్రం శ్రీకాకుళం’ అనే సినిమాతో హీరోయినుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శ్రద్దాకి ఫస్ట్ తెలుగు సినిమా కూడా అదే. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికి అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు. కానీ మొదటి నుండి కూడా తన గ్లామర్ తో తెలుగు యువతను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ అమ్మడు కేవలం తెలుగు భాషకే అంకితం కాలేదు. హిందీ తమిళంతో కన్నడ మలయాళంలో కూడా మెరిసింది. ఇన్నేళ్ళైనా శ్రద్దా ఇంకా తనను తను ప్రూవ్ చేసుకోడానికి ట్రై చేస్తూనే ఉంది.

కానీ ప్రస్తుతం అయితే అమ్మడి చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయట. ఒక నటిగా తను బిజీ కానప్పటికి గ్లామర్ డాల్ గా మాత్రం దేశవ్యాప్తంగా ఫేమ్ అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం సోషల్ మీడియాలో అమ్మడి అందాలను ఆరాధించే అభిమానుల సంఖ్య లక్షలలో ఉంటుంది. ఎందుకు తగ్గట్టుగానే ఈ భామ.. తన వయ్యారాలు కొద్దీ కొద్దీగా కొసరుతూ ఫ్యాన్స్ లో చిచ్చురెపుతోంది. శ్రద్ధ తన కెరీర్ లో మాక్సిమం అన్ని రొమాంటిక్ గ్లామర్ షో పాత్రలే చేసింది. ఎంత బోల్డ్ గా గ్లామర్ గుప్పించినా.. ఎన్ని ఫోటోషూట్స్ చేసినా ఈ బ్యూటీకి హిట్స్ మాత్రం దగ్గరికి రావట్లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ కలిగిన శ్రద్దా.. ఈ మధ్య మరీ గ్లామర్ డోస్ పెంచేసింది. సెల్ఫీలు అంటూ తన అందాలన్నీ పరిచి నెటిజన్లకు విందుగా వడ్డిస్తోంది. మరి అమ్మడి సోయగాలను చూస్తూ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అలా ఈ వయ్యారి భామ పోజులను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Share via
Copy link