Templates by BIGtheme NET
Home >> Cinema News >> డైరెక్ట్ ఓటీటీ రిలీజుల పుణ్యమా అని మళ్ళీ పుంజుకున్న శాటిలైట్ మార్కెట్…!

డైరెక్ట్ ఓటీటీ రిలీజుల పుణ్యమా అని మళ్ళీ పుంజుకున్న శాటిలైట్ మార్కెట్…!

సినిమాకు ఒకప్పుడు థియేటర్ రన్ మాత్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగేకొద్దీ సినిమా మార్కెట్ కూడా పెరుగుతోంది. కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాక.. శాటిలైట్ రైట్స్ – డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నిర్మాతలు లాభాలు అందుకుంటున్నారు. ఇంతకముందు శాటిలైట్ రైట్స్ అంటే పెద్దగా ఎవరికి తెలిసేవి కాదు. ఏదో అమ్మామంటే అమ్మాం అన్నట్లుగా.. ఓ డిస్ట్రిబ్యూటర్ కి అమ్మినట్లుగా సినిమాని అమ్మేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమాల శాటిలైట్ రైట్స్ భారీ రేట్లకు అమ్మడుపోతున్నాయి.

అయితే కరోనా మహమ్మారి థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతబడిపోయాయి.. దీంతో థియేటర్స్ లో సినిమాల విడుదల ఆగిపోయింది. ఇదే సమయంలో ఓటీటీలు దీన్ని క్యాష్ చేసుకోడానికి ఒరిజినల్ మూవీస్ – వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేయడం స్టార్ట్ చేసారు. ఇంతకముందు సినిమా రిలీజైన నాలుగైదు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెట్టేవారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే చాలా ఓటీటీలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో శాటిలైట్ రైట్స్ కి మళ్ళీ రెక్కలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో త్వరలో రాబోయే క్రేజీ సినిమాలను భారీ రేట్లు ఇచ్చి టెలివిజన్ ఛానల్స్ వారు దక్కించుకుంటున్నారు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శాటిలైట్ రైట్స్ ‘స్టార్ మా’ డీల్ చేసిందని తెలుస్తోంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ సుమారు 11 కోట్లకి అమ్ముడైనట్లుగా సమాచారం. అలానే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’.. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా ‘స్టార్ మా’ సొంతం చేసుకుందని తెలుస్తోంది. వీటి కోసం ‘స్టార్ మా’ వారు భారీగానే వెచ్చించారని అనుకుంటున్నారు. వీటితో పాటు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న క్రేజీ మూవీస్ శాటిలైట్ రైట్స్ కోసం టీవీ ఛానల్స్ పోటీపడుతున్నాయని తెలుస్తోంది.

Share via
Copy link