Templates by BIGtheme NET
Home >> Cinema News >> కెరీర్ పరంగా సామ్ స్లో అయినట్లే కదా..!

కెరీర్ పరంగా సామ్ స్లో అయినట్లే కదా..!

‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత.. గత కొన్నేళ్లుగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. దక్షిణాది స్టార్ హీరోల సరసన నటించిన సామ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇక తన ఫస్ట్ హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని కోడలిగా మారింది సమంత. పెళ్ళైన తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఒకవైపు వైవాహిక జీవితాన్ని మరోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. పెళ్లి అనేది హీరోయిన్ల కెరీర్ కు అడ్డంకి కాదని నిరూపించింది. సినిమాలతోనే కాకుండా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ద్వారా వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టింది. అంతేకాకుండా హోస్ట్ గా . అయితే ఈ మధ్య సినీ కెరీర్ పరంగా సమంత కాస్త స్లో అయినట్లు అనిపిస్తోంది.

సమంత గతేడాది ‘ఓ బేబీ’ ‘మజిలీ’ వంటి సినిమాల్లో నటించింది. ఈ ఏడాది ఆరంభంలో ‘జాను’ తో పలకరించిన సామ్.. ఇప్పటివరకు మరో తెలుగు సినిమా ప్రకటించలేదు. కాకపోతే తమిళ్ లో మాత్రం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో విజయ్ సేతుపతి – నయనతార లతో కలిసి నటించనుంది. వాస్తవానికి సమంత కంటే సీనయర్ హీరోయిన్లు జూనియర్ హీరోయిన్లు కూడా ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ సమంత ఆహా యాప్ లో వచ్చే ‘సామ్ జామ్’ టాక్ షో లో మాత్రమే కనిపిస్తోంది. దీంతో సమంత కెరీర్ నెమ్మదించనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా సమంత యాక్ట్ చేసిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ అయింది. వచ్చే జనవరిలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలవచ్చని సమాచారం.

Share via
Copy link