Templates by BIGtheme NET
Home >> Cinema News >> మా ఫ్రిజ్ లో స్టాక్ ఉంటుంది: చిరు… ‘సామ్ జామ్’ ప్రోమో వైరల్..

మా ఫ్రిజ్ లో స్టాక్ ఉంటుంది: చిరు… ‘సామ్ జామ్’ ప్రోమో వైరల్..

మెగాస్టార్ దోశ వేశారు.. ఆడియన్స్ ఫిదా అయ్యారు. చిరు కామెడీ చేశారు.. ఫ్యాన్స్ పొట్ట చెక్కలైంది. ‘ఆహా’ ఓటీటీలో స్టార్ హీరోయిన్ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘సామ్ జామ్.’ ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఇప్పటికే విడుదలైన తొలి ప్రోమో వైరల్ అయ్యి అభిమానులను ఎంతగానో అలరించింది. లేటెస్ట్ గా మరో ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో ఎంతో హుషారుగా కనిపించిన మెగాస్టార్.. జోక్స్ వేస్తూ అందరినీ నవ్వించారు. ఈ ప్రోమో చూసిన కోట్లాది మంది ప్రేక్షకులు ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ లేటెస్ట్ ప్రోమోలో.. మెగాస్టార్ చిన్ననాటి ఫొటో చూపించిన సమంత.. అక్కడ కోపంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. అవును అప్పట్లో చాలా కోపంగా ఉండేవాన్నని నవ్వేశారు చిరు. ఆ తర్వాత.. మీ ఫ్రిజ్ లో ఎప్పటికీ ఉండే ఒక ఐటమ్ ఏంటని అడగ్గా.. మెగాస్టార్ ఆల్కహాల్ పెగ్ అన్నట్టుగా సైగ చేశారు. దీంతో.. సమంతాతోపాటు.. ఆడియన్స్ పగలబడి నవ్వారు. అయితే.. చిరు మాత్రం నేను అన్నది వేరు మీరు అనుకున్నది వేరు అనడంతో మరింతగా నవ్వారు.

ఆ తర్వాత.. సినిమా చూస్తూ మీరెప్పుడైనా ఏడ్చారా? అని సమంతా అడగ్గా.. ‘సినిమా చూస్తూ రెండు కళ్ల వెంట ధారలు కారుతున్నాయి. కర్చీఫ్ తో కళ్లు తుడుచుకుంటున్నాను.. తీరా చూస్తే నా చేతిలో ఉన్నది పైట కొంగు’ అన్నారు చిరు. దీంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. మెగాస్టార్ స్టైల్లో ‘చిరు’దోశ వేయాలని కోరగా.. సిద్ధమయ్యారు చిరంజీవి. అయితే.. రెగ్యులర్ గా వేస్తే స్పెషల్ ఏముంది అంటూ కళ్లకు గంతలు కట్టుకుని ప్రిపేర్ చేశారు. వైవా హర్ష చిరు కళ్లకి గంతలు కట్టారు. దోశను ఫ్లిప్ చేస్తూ మెగాస్టార్ సందడి చేశారు. ఆ తర్వాత.. వీల్ చైర్లో కూర్చున్న ఓ బాలుడు నోటితోో బ్రష్ పట్టుకొని మెగాస్టార్ బొమ్మ వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి స్పందించిన చిరు.. ‘నన్ను కలవాలనే కోరిక నీది.. నిన్ను కలవాలనే కోరిక నాది’ అంటూ ఆ చిన్నారిని హత్తుకున్నారు.

ఈ విధంగా ఎంతో అద్భుతంగా కట్ చేసిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ ను ‘ఆహా’ ఓటీటీలో క్రిస్మస్ కానుకగా డిసెంబ్ 25న విడుదల కాబోతోంది. అక్కినేని కోడలు సమంత అలరిస్తున్న ఈ షోలో.. ఇప్పటికే విజయ్ దేవరకొండ – రానా – తమన్నా – రకుల్ ప్రీత్ సింగ్ – నాగ్ అశ్విన్ – క్రిష్ తదితరులు పాల్గొని సందడి చేయగా.. ఇప్పుడు చిరంజీవి విచ్చేశారు. ఇలాంటి షోలో మెగాస్టార్ పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share via
Copy link