Templates by BIGtheme NET
Home >> Cinema News >> సందీప్ రెడ్డిలా సాయి రాజేష్ కెరీర్ ప్లాన్ చేసాడా?

సందీప్ రెడ్డిలా సాయి రాజేష్ కెరీర్ ప్లాన్ చేసాడా?

‘బేబి’ హిట్ తో సాయిరాజేష్ నీలం పేరు టాలీవుడ్ లో మారుమ్రోగిన సంగ‌తి తెలిసిందే. ఒక్క విజ‌యం ఆయ‌న‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచింది. త‌క్కువ బ‌డ్జెట్ లోనే తెరకెక్కించిన సినిమా భారీగా లాభాలు తీసుకొచ్చింది. బోల్డ్ కంటెంట్ ని మార్కెట్ లో కి ఎలా ఎక్కించాలో ఎక్కించి తెలివిగా ఎన్ క్యాష్ చేసుకున్నాడు. అంతిమంగా విజ‌యం అనేది సాయి రాజేష్ ని మార్కెట్ లో నిల‌బెట్టింది. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా కొత్త అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసే దిశ‌గానూ కొన్ని రోజులుగా అక్క‌డ వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. కానీ సెట్ అవ్వ‌డంలో డిలే జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో అన్ని అవాంత‌రాలు దాటుకుని చివ‌రికి ‘బేబి’ హిందీ రీమేక్ లాక్ అయిన‌ట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా సాయి రాజేష్ తెర‌కెక్కించే దిశ‌గా అగ్రిమోంట్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లో బాబీ డియోల్ కుమారుడు ఆర్యమాన్‌ను మెయిన్ రోల్ కి ఎంపికైన‌ట్లు స‌మాచారం. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగులో స‌క్సెస్ అవ్వ‌డానికి కార‌ణం తెలుగు అమ్మాయి వైష్ణ‌వి కీ రోల్ పోషించ‌డం అన్నది తెలిసిందే. ఆ పాత్ర‌లో ఆమె అభిన‌యిం చిన తీరు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. ఈ నేప‌థ్యంలో సాయి రాజేష్ బాలీవుడ్ లో కూడా ఇదే స్ట్రాట‌జీతో ముందుకెళ్లాలా ప్లాన్ చేస్తున్నట్లున్నారు.

అందుకే కొత్త బ్యూటీని తీసుకుని అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిన‌ట్లు తె లుస్తోంది. అలాగే సాయి రాజేష్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్న‌ట్లు స‌మాచారం. సాయిరాజేష్ కిది మంచి అవ‌కాశం. హిందీలో హిట్ అందుకుంటే కెరీర్ మారిపోతుంది. సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో అలాగే నిల‌దొక్కుకున్న సంగ‌తి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ని బాలీవుడ్ లో ‘క‌బీర్ సింగ్’ గా రీమేక్ చేసి హిట్ అందుకుని ర‌ణ‌బీర్ క‌పూర్ తోనే ఛాన్స్ అందుకున్నాడు. అలాంటి అవ‌కాశం సాయి రాజేష్ కి కూడా ఉంది.

Share via
Copy link