Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెట్టింట హల్చల్ చేస్తున్న బాలీవుడ్ బికినీ సుందరి..!!

నెట్టింట హల్చల్ చేస్తున్న బాలీవుడ్ బికినీ సుందరి..!!

బాలీవుడ్ భామ రూహి సింగ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఇరవై ఏడేళ్ల వయసున్న ఈ రాజస్థాని భామ.. 2015లో ‘క్యాలెండర్ గర్ల్స్’ అనే సినిమాతో బాలీవుడ్ తెర పై అడుగుపెట్టింది. మొదటి నుండి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రూహి.. 2011లో మోడలింగ్ వైపు మళ్ళింది. అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీలలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచి ఆకర్షణగా నిలిచింది. ఇక 2012లో రూహి ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ అనే ఇంగ్లీష్ డాకుమెంటరీతో తన నటన ప్రస్థానం మొదలు పెట్టింది. అనంతరం 2014లో ఇండియన్ టాప్ 25 మోస్ట్ డిసైరాబుల్ ఉమెన్స్ లో ఒకరిగా స్థానం సంపాదించుకుంది.

క్యాలెండర్ గర్ల్స్ సినిమా తర్వాత ‘ఇష్క్ ఫరెవర్’ అనే సినిమాలో నటించింది. ఇక అమ్మడు 2017లో బొంగు అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక త్వరలో మంచు విష్ణు నిర్మిస్తూ నటిస్తున్న ‘మోసగాళ్లు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ తన అందచందాల ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు అభిమానాన్ని సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో అమ్మడు తన వయ్యారాలతో రెచ్చిపోతుందని చెప్పాలి. రూహికి బికిని వేయడం కొత్తేమి కాదట. అందుకే మరోసారి బీచ్ లో బికినీ వేసి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తాజాగా ఈ భామ పోస్ట్ చేసిన బికినీ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. చూడాలి మరి ఫ్యాన్స్ అభిప్రాయం ఏంటో..!

Share via
Copy link