Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘అల్లుడు అదుర్స్’ నుంచి రొమాంటిక్ ‘నదిలా నదిలా’ సాంగ్..!

‘అల్లుడు అదుర్స్’ నుంచి రొమాంటిక్ ‘నదిలా నదిలా’ సాంగ్..!

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ”అల్లుడు అదుర్స్” ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు మూడు లిరికల్ వీడియో సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘అల్లుడు అదుర్స్’ నుంచి నాల్గవ సాంగ్ ‘నదిలా నదిలా’ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్ ని కాశ్మీర్ మంచు ప్రదేశాలలో షూట్ చేసినట్లు తెలుస్తోంది.

‘నదిలా నదిలా నదిలా.. కదిలావే ఓ నదిలా.. అల లా అల లా తడిపావే నన్ను ఇలా..’ అంటూ సాగిన ఈ పాటను దేవిశ్రీ తమ్మడు సాగర్ మరియు హరిప్రియ కలిసి ఆలపించారు. ‘చక చకమంటూ నా మనసేపుడూ పరిగేడుతుందే నీ వైపే..’ అంటూ లిరిసిస్ట్ శ్రీమణి క్యాచీ లిరిక్స్ అందించాడు. అందమైన స్నో ఫాల్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ కి చోటా కె. నాయుడు అందించిన విజవల్స్ బాగున్నాయి. ఇందులో సాయి శ్రీనివాస్ – నభా నటేష్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. కాగా గంజి రమేష్ కుమార్ సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో నభా నటేష్ తో పాటు అనూ ఇమాన్యుల్ మరో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ – సోనూసూద్ – వెన్నెల కిషోర్ – సత్య – బ్రహ్మాజీ – సప్తగిరి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Share via
Copy link