Templates by BIGtheme NET
Home >> Cinema News >> అడ్వకేట్ గా మారిన ‘రెడ్’ హీరోయిన్..!

అడ్వకేట్ గా మారిన ‘రెడ్’ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అంటుంటారు. యాక్టర్ అయిన తర్వాత తమ కలల్ని నిజం చేసుకోడానికి ప్రయత్నించిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే లాయర్ కాబోయి హీరోయిన్ అయిన మాళవిక శర్మ.. హీరోయిన్ అయిన తర్వాత కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ముంబైలో పుట్టి పెరిగిన మాళవిక శర్మ.. రాజ్వీ లా కాలేజ్ లో ఎల్ఎల్బీ పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ రాణించిన మాళవిక కు మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘నేల టికెట్’ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇలా లాయర్ కాబోయి హీరోయిన్ అయిన మాళవిక శర్మ.. పట్టుదలతో చదివి లాయర్ పట్టా పుచ్చుకుని మహారాష్ట్ర & గోవా బార్ కౌన్సిల్ లో మెంబెర్ షిప్ సంపాదించింది. ఈ విషయాన్ని మాళవిక శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

బాంబే హైకోర్టులో అడ్వకేట్ గా ఐడీ కార్డుని పోస్ట్ చేసిన మాళవిక ”మీ కలలను ఫాలో అవ్వండి.. నిర్భయంగా ఉంటూ వాటిని కొనసాగించడానికి తగిన ధైర్యం ఉంటే మన కలలన్నీ నిజమవుతాయి” అని చెప్పుకొచ్చింది. అడ్వకేట్ గా మారిన మాళవిక శర్మను అందరూ ప్రశంసిస్తున్నారు. కాగా రవితేజ – కళ్యాణ్ కృష్ణ కాంబోలో వచ్చిన ‘నేల టికెట్’ సినిమాలో మాళవిక హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ సినిమా ప్లాప్ అవడంతో అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితేనేం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు మతులు పోయేలా చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రామ్ పోతినేని ‘రెడ్’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఎప్పటికైనా మంచి క్రిమినల్ లాయర్ గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్న మాళవిక శర్మ.. ఫ్యూచర్ లో హీరోయిన్ గా కూడా కొనసాగుతుందేమో చూడాలి.

Share via
Copy link