Templates by BIGtheme NET
Home >> Cinema News >> విటమిన్ డి కోసం బికినీ బీచ్ కి వెళ్లాలా రకుల్?

విటమిన్ డి కోసం బికినీ బీచ్ కి వెళ్లాలా రకుల్?

మీ వాచ్ లో సమయం ఎంత?.. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ `ఇట్స్ టాన్ ఓ క్లాక్` అంటోంది. రకుల్ కి సూర్యుని ఎండలో నించుని విటమిన్ -డి ని సంగ్రహించడం అంటే చాలా ఇష్టం. అది కూడా బికినీ బీచ్ పరిసరాల్లో 10 ఓ క్లాక్ కి అలా చేస్తుందట. ఎప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినా అస్సలు వదులుకోదుట. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.

రకుల్ తాజాగా ఓ రేర్ ఫోటోని షేర్ చేసింది. మెష్ ఓవర్లే డిజైన్ తో బ్లాక్ బికినీలో కనిపించింది. ఇలాంటి డ్రెస్ సూర్యుడి నుంచి టాన్ ని సంగ్రహిస్తుందట. చర్మశుద్ధి కోసం ఇలా చేయాలంటోంది. సముద్రం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే.. విటమిన్ డి మంచి మోతాదులో దక్కిందని తెలిపింది. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీసినది? అంటే.. ఇదివరకూ మాల్దీవుల విహారానికి వెళ్లినప్పటి త్రోబ్యాక్ ఫోటో అని తెలిపింది. కొత్త సంవత్సర సెలబ్రేషన్స కి మాల్దీవులకు వెళ్లిన రకుల్ అక్కడ దారి తప్పి విహరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అదే దీవిలో తన ప్రియుడు కూడా దిగిపోయాడన్న గుసగుసలు అప్పట్లో వేడెక్కించాయి.

రకుల్ కెరీర్ ని పరిశీలిస్తే.. వైష్ణవ్ తేజ్ -కొండపొలం .. నితిన్ తో `చెక్` చిత్రీకరణలను పూర్తి చేశారు. భారతీయుడు 2 కి సంబంధించిన తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.

Share via
Copy link