Templates by BIGtheme NET
Home >> Cinema News >> చినుగుల డెనిమ్ నిక్కరులో రకుల్ చిల్ జిల్

చినుగుల డెనిమ్ నిక్కరులో రకుల్ చిల్ జిల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఫ్యాషనిస్టాల జాబితా తిరగేస్తే అందులో రకుల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. స్వతహాగానే రకుల్ అందాల పోటీల నుంచి ర్యాంప్ వాక్ నుంచి వచ్చిన భామగా ఎందులోనూ తగ్గదు. ముఖ్యంగా గ్లామర్ ఎలివేషన్ ఆరబోతకు ఎలాంటి మొహమాటం కనబరచదు.

పరేషాను అయ్యానులే! అంటూ యూత్ ఒకటే ఫిదా అయిపోవాల్సిందే. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా ముంబైలో ఫేజ్ 3 ప్రపంచంలో నిరంతరం రకుల్ తళుకుబెళుకుల ప్రదర్శన హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఇటీవల తెలుగు- హిందీ చిత్రాల్ని బ్యాలెన్స్ చేస్తోంది. హైదరాబాద్ టు ముంబై రకుల్ వరుస ప్రయాణాలు తప్పడం లేదు.

తాజాగా ముంబైలోని రెస్టారెంట్ వెలుపల ఇదిగో ఇలా ముంబై మీడియా కంట పడింది. చినుగుల డెనిమ్ నిక్కరు ఊల్ టాప్ తో రెస్టారెంట్ పరిసరాల్లో ఇలా కనిపించగానే అందరి కళ్లు అటువైపే ప్రసరించాయి. బ్లూ డెనిమ్ నిక్కరుకి స్టైలిష్ టాప్ కాంబినేషన్ కట్టి పడేసింది. ముఖ్యంగా థై సొగసుల ఎలివేషన్ లో రకుల్ ఎక్కడా తగ్గలేదు మరి.

ఇటీవలే రకుల్ కోవిడ్ భారిన పడి తిరిగి కోలుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై టు హైదరాబాద్ షూటింగుల కోసం ప్రయాణాలు సాగిస్తోంది. ఇటీవలే వైష్ణవ్ తేజ్- క్రిష కాంబో మూవీని పూర్తి చేసి అజయ్ దేవగన్ దర్శకత్వంలో మేడే చిత్రీకరణలో పాల్గొంది. ఈ చిత్రం 29 ఏప్రిల్ 29 2022 న విడుదల కానుంది. జాన్ అబ్రహం సరసన ఎటాక్ లోనూ రకుల్ నటిస్తోంది. అలాగే భారతీయుడు 2 చిత్రీకరణకు రకుల్ ఎటెండ్ కావాల్సి ఉంటుంది.

Share via
Copy link