Templates by BIGtheme NET
Home >> Cinema News >> Rajnikanth : స్పెషల్ ఫ్లైట్లో రజనీకాంత్

Rajnikanth : స్పెషల్ ఫ్లైట్లో రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా బయల్దేరారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ప్రయాణమయ్యారు. రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసమే రజనీ యూఎస్ వెళ్లినట్టు తెలుస్తోంది. 14 సీట్ల కెపాసిటీ కలిగిన విమానం చెన్నై విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరింది.

ప్రస్తుత కరోనా కండీషన్లో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విమానంలో బయల్దేరారు. యూఎస్ వెళ్లడానికి కొన్ని రోజుల కిందటే సిద్ధమైన రజనీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచిఉన్నట్టు సమాచారం. పర్మిషన్ వచ్చినందువల్ల ఇవాళ ప్రయాణమైనట్టు తెలుస్తోంది.

2016 మే నెలలో అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు రజనీ. ఆ తర్వాత ప్రతీ సంవత్సరం రెగ్యులర్ చెకప్ కోసం వెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఇదేవిధంగా బయల్దేరినట్టు తెలుస్తోంది. ఇవాళ వెళ్లిన తలైవా.. తిరిగి జులై 8న ఇండియా రానున్నారు.

ఇప్పటికే.. అల్లుడు ధనుష్ కూతురు అమెరికాలో ఉన్నారు. ఓ హాలీవుడ్ చిత్రంలో ధనుష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడికి వెళ్తున్న రజనీ.. హెల్త్ చెకప్ తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండి రిలాక్స్ అయిన తర్వాత తిరిగి రానున్నారు.

ఇదిలాఉండగా.. రజనీ అప్ కమింగ్ మూవీ ‘అన్నాత్తే’ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇందులో రజనీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యింది. కొంత భాగమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.

Share via
Copy link