Templates by BIGtheme NET
Home >> Cinema News >> చిరకాల స్నేహితురాలిని మనువాడిన నటుడు

చిరకాల స్నేహితురాలిని మనువాడిన నటుడు

ఈ ఏడాది అన్ని భాషల సినిమా పరిశ్రమలకు చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఒక వైపు కరోనా భయపెడుతూ ఉంటే.. మరో వైపు సినిమాలు విడుదల కాక థియేటర్లు దుమ్ము పట్టి పోతుంటే మరో వైపు ఓటీటీ వెలుగు వెలుగుతుంటే మరో వైపు సినీ ప్రముఖులు పలువురు పెళ్లి పీఠలు ఎక్కారు. కరోన సమయంలో పెళ్లిలు చాలానే జరిగాయి. ప్రతి ఏడాదితో పోల్చితే ఈ ఏడాది కాస్త ఎక్కువగానే సినిమా పరిశ్రమల్లో పెళ్లిలు జరిగాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మలయాళ నటుడు రాహుల్ రవి తన చిరకాల స్నేహితురాలు అయిన లక్ష్మీ నాయర్ ను వివాహం చేస్తున్నాడు. వీరిద్దరి మద్య సుదీర్ఘ కాలంగా ప్రేమ కొనసాగుతున్నట్లుగా మలయాళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రాహుల్ రవి.. లక్ష్మీ నాయర్ ల వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు లైఫ్ లో ఆనందంగా ఉండాలని చాలా మంది ఆశీర్వదిస్తున్నారు. ఇక లక్ష్మీ నాయర్ గురించి సోషల్ మీడియాలో అదిరి పోయేలా ఒక మెసేజ్ ను రాహుల్ షేర్ చేశాడు. నిన్న మొదటి రోజు కలిసినప్పుడు ఎలా అయితే ఉద్వేగానికి లోను అయ్యానో అలాగే ఇప్పుడు కూడా ఉంది. రోజు రోజుకి నువ్వు ఎంతో ప్రత్యేకంగా నాకు కనిపిస్తున్నావు. నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నువ్వు చెప్పే మాటలు వింటే ప్రపంచాన్నే మర్చిపోతున్నాను. నీవు నాతో కలిసినందుకు థ్యాంక్యూ లక్ష్మీ అంటూ తన ప్రేమను రాహుల్ రవి షేర్ చేశాడు.

Share via
Copy link