Templates by BIGtheme NET
Home >> Cinema News >> 11 మంది పిల్లల్ని కంటానన్న అమెరికా కోడలు!

11 మంది పిల్లల్ని కంటానన్న అమెరికా కోడలు!

ఇంటికి ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు! అనే నినాదం పిల్లల్ని కనే విషయంలో అడ్డంకిగా ఉంది. 120 కోట్లను మించిపోయిన దేశ జనాభా అసంఖ్యాకంగా పెరుగుతుంటే ప్రభుత్వం కట్టడి చేసేందుకు ఎత్తుగడలు వేస్తూనే ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ప్రియాంక చోప్రా చేసిన ప్రకటన అందరికీ షాకిచ్చింది.

ప్రియాంక చోప్రా .. నిక్ జోనాస్తో ఏకంగా 11 మంది పిల్లల్ని కంటానని ప్రకటించారు. ప్రియాంక చోప్రా జోనాస్ ఇటీవల ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. భర్త నిక్ జోనాస్ తో తనకున్న అనుబంధం గురించి వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. గ్లోబల్ ఐకాన్ పీసీ తాను ఎంత మంది పిల్లలను కనాలని అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు .. తనకు 11 మంది పిల్లలను కనాలని ఉందని చెప్పారు.

సరదాగా నవ్వేస్తూ… వాస్తవానికి 11 మంది ఉన్న క్రికెట్ జట్టును తాను కోరుకుంటున్నానని అనడంతో నవ్వులు కురిసాయి. కొంతకాలం తర్వాత ఈ ఆలోచనను పునరాలోచిస్తే.. అప్పుడు 11 చాలా ఎక్కువ కావచ్చు అని “నాకు అంత ఖచ్చితంగా తెలియదు“ అని కూడా సంభాషణను కొనసాగించారు.

ఎంత మందిని రాసిపెట్టి ఉంటే అంతమంది అని కూడా పీసీ ఈ సందర్భంగా అన్నారు. అదే ఇంటర్వ్యూలో భర్త నిక్ జోనాస్ కి తనకు మధ్య సాంస్కృతిక విభేదాలపైనా.. వయస్సు-అంతరం గురించి ఓపెన్ గా మాట్లాడారు. భారతీయ సంస్కృతిని `నీటిలోకి వదిలిన చేపలు` తరహాలో సంగ్రహించినందుకు భర్త నిక్ ను పీసీ ప్రశంసించింది. ఈ తరహా రిలేషన్ లో `అడ్డంకులు` రాలేదని చెప్పింది.

తనకు నిక్ కి మధ్య 10 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉన్నా..ఈ రిలేషన్ లో సాంస్కృతిక వ్యత్యాసంపైనా ముచ్చటించారు. పీసీ మాట్లాడుతూ…“ఇతర జంటల మాదిరిగానే మేం కూడా ఒకరికొకరు సంస్కృతి పరంగా విభేదాలను అర్థం చేసుకున్నాం. అలాగే అవతలివారు ఇష్టపడే వాటితో సర్ధుబాటు చేసుకోవాలి. నిజానికి ఈ అంతరాలను `అడ్డంకి`గా చూడలేదు. అడ్వెంచర్ గా భావించాం అని పీసీ తెలిపారు. సంస్కృతులు రెండూ బాగా సర్దుబాటు అయ్యాయని .. రెండింటి మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తలేదని పీసీ అన్నారు.

Share via
Copy link