Templates by BIGtheme NET
Home >> Cinema News >> బికినీ ‘ట్రీట్’తో అల్లాడిస్తున్న పూజా హెగ్డే!

బికినీ ‘ట్రీట్’తో అల్లాడిస్తున్న పూజా హెగ్డే!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే.. అది ముంబై భామ పూజా హెగ్డే అనే చెప్పాలి. గత కొన్ని సినిమాల నుండి వరుసగా భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ముకుంద సినిమాతో కెరీర్ ప్రారంభించిన పూజ.. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని పాన్ ఇండియా సినిమాలను చేజిక్కించుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ ప్రభాస్ ఇలా అందరి హీరోలతో సినిమాలు చేసేసింది. గతేడాది అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అయితే సోషల్ మీడియాలో పూజకు ఫాలోయింగ్ మాములుగా లేదు.

ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ బికినీ పిక్ షేర్ చేసింది. ఆ ఫోటోలో పూజా నీటి పై తేలుతూ.. స్టైలిష్ కళ్లద్దాలు ధరించి కెమెరాకు వెళ్ళకిలా పోజిచ్చింది. మరి అసలే టు పీస్ బికినీ వేసింది అమ్మడు.. అభిమానులు ఊరుకుంటారా.. అలా బికినీతో కవ్విస్తున్న పూజ ఫోటోను లైక్స్ షేర్స్ తో వైరల్ చేసేస్తున్నారు. మిక్సడ్ పింక్ కలర్ లో పూజ అల్లాడిస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే తెలుగులో రాధేశ్యామ్ మూవీతో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. ఇవేగాక బాలీవుడ్ లో రన్వీర్ సింగ్ సరసన ‘సర్కస్’ సినిమా షూటింగులో పాల్గొంది. అంతేగాక కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూజా మోస్ట్ వాంటెడ్ మాత్రమే కాదు మోస్ట్ బిజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share via
Copy link