Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవన్-రానా మూవీ టైటిల్ అదేనట..?

పవన్-రానా మూవీ టైటిల్ అదేనట..?

టాలీవుడ్ లో తెరకెక్కనున్న మరో క్రేజీ మల్టీ స్టారర్.. పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి మూవీ. మళయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ను ఈ స్టార్లు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. లేటేస్ట్ గానే ఈ చిత్ర ప్రారంభోత్సం కూడా జరిగింది. ఇతర పాత్రల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. అయితే.. ఈ సినిమాకు ఏ పేరు పెడతారనేది ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

‘అయ్యప్పనుమ్ కోషియం’ అంటూ.. మలయాళ వెర్షన్కు టైటిల్గా రెండు లీడ్స్ పేర్లు ఉన్నాయి. ఇదేవిధంగా.. తెలుగు వెర్షన్కు కూడా రెండు పేర్లతో టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ‘బిల్లా-రంగా’ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బిల్లాగా పవన్ కల్యాణ్ రానాగా రంగా నటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. వాస్తవానికి.. ఈ రీమేక్ లో పవన్ పేరు వినిపించగానే ‘బిల్లా-రంగా’ టైటిల్ తెరపైకి వచ్చింది.

ఇది మెగాస్టార్ చిరంజీవి టైటిల్. ఈ పేరుతో 1982లో విడుదలైన చిత్రం మంచి విజయం సాధించింది. ఇందులో బిల్లాగా చిరంజీవి రంగాగా మోహన్ బాబు నటించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ తన సోదరుడి సినిమా టైటిల్ పై తప్ప మరో టైటిల్ పై ఇంట్రస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు అదే సరైనదని పవర్ స్టార్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే.. మరో చర్చ కూడా నడుస్తోంది. ఈ చిత్రం స్క్రిప్ట్లో త్రివిక్రమ్ పాల్గొంటున్నారు. కాబట్టి అతను కవితాత్మంగా ఏదైనా పేరును సూచించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం అంటున్నారు. పవర్ స్టార్ లాంటి హీరో చిత్రానికి ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ పెట్టి పవన్ ను ఒప్పించారు. అది ఘన విజయం సాధించింది కూడా. కాబట్టి.. అదే కోవలో ఏదైనా కొత్త టైటిల్ కూడా సూచించొచ్చు ఎవరికి తెలుసు అంటున్నారు పలువురు.

కాగా.. పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుం వకీల్ సాబ్ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఆ తర్వాత ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లో పాల్గొంటారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘క్రిష్’ ‘హరీష్ శంకర్’ దర్శకత్వంలో రెండు సినిమాలు చేయనున్నాడు పవర్ స్టార్. పాలిటిక్స్ లో బిజీగా ఉండే పవన్.. ఈ సినిమాలను త్వరగా పూర్తిచేసి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.

Share via
Copy link