Templates by BIGtheme NET
Home >> Cinema News >> యాంకర్ ప్రదీప్ కు పవన్ కల్యాణ్ గిఫ్ట్.. త్వరలోనే

యాంకర్ ప్రదీప్ కు పవన్ కల్యాణ్ గిఫ్ట్.. త్వరలోనే

ప్రముఖ ఎఫ్ఎమ్ సంస్థలో రేడియో జాకీగా కెరీర్ను ఆరంభించాడు ప్రదీప్ మాచిరాజు. ఆ తర్వాత ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్’ అనే గేమ్ షోతో యాంకర్గా మారాడు. ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే షోతో తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. అలా వేగం పుంజుకున్న ప్రదీప్ కెరీర్.. దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంది. అద్భుతమైన టైమింగ్తో పంచులు.. ఆకట్టుకునే వాక్చాతుర్యంతో తన సత్తా ప్రదర్శిస్తూ నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తున్నాడు. అయితే టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్.. ప్రదీప్కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. ఈ విషయాన్ని ప్రదీప్ స్వయంగా వెల్లడించాడు.

చాలా తక్కువ సమయంలోనే టాప్ యాంకర్ గా ఎదిగిన ప్రదీప్.. బుల్లి తెరపై వరుస ఆఫర్లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ‘ప్రదీప్ దర్భార్’ ‘ఎక్స్ప్రెస్ రాజా’ ‘అదుర్స్’ ‘నర్తనశాల’ ‘కిక్’ ‘డ్రామా జూనియర్స్’ ‘ఢీ’ ‘సరిగమప’ వంటి షోలలో యాంకర్గా మెప్పించాడు. ఈ క్రమంలో పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించాడు.

అయితే.. లేటెస్ట్ గా హీరోగా మారాడీ యాంకర్. ప్రదీప్ నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా ఇటీవలే విడుదలైంది. దర్శకుడు మున్నా తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ఇందులో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ సంగీతం అందించాడు.

అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం రూ. 4.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ.. ఊహించని విధంగా నాలుగు రోజుల్లోనే టార్గెట్ను అందుకుంది. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల వరకూ లాభాలను అందుకుందని టాక్. హీరోగా చేసిన మొదటి సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు ప్రదీప్. ఈ ఉత్సాహంలోనే సక్సెస్ఫుల్ షో ‘కొంచెం టచ్లో ఉంటే చెప్తా’ ఐదో సీజన్ను ప్రారంభించబోతున్నాడట.

కాగా.. ‘కొంచెం టచ్లో ఉంటే చెప్తా’ ఐదో సీజన్ ప్రారంభ ఎపిసోడ్కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా రాబోతున్నాడని సమాచారం. ఇటీవల ప్రదీప్ మాట్లాడుతూ.. ‘పవన్ సార్ ఎప్పుడో రావాలి. కానీ బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు. ఈ సారి సీజన్కు మాత్రం వస్తున్నారు’ అని వెల్లడించాడు. దీంతో పవర్ స్టార్ వచ్చేది నిజమేనని తెలుస్తోంది. వాస్తవంగా.. ఇలాంటి టాక్ షోలకు కార్యక్రమాలకు పవన్ దూరంగా ఉంటాడు. మరి ఇదే గనక జరిగితే బుల్లితెరపై రికార్డులు క్రియేట్ అవడం ఖాయమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Share via
Copy link