Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘గతం’ కు పనోరమ అవార్డ్

‘గతం’ కు పనోరమ అవార్డ్

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో తెలుగు సినిమా ‘గతం’ సినిమాకు ఇండియన్ పనోరమ అవార్డు దక్కింది. ఈ ఏడాది నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విభిన్నమైన థ్రిల్లర్ సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించాడు. సినిమా కథ రీత్యా మొత్తం కూడా అమెరికాలోనే చిత్రీకరించారు. మొదటి నుండి చివరి వరకు సినిమా చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సినిమాను ఇండియన్ పనోరమ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు నుండి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించేందుకు గాను కేవలం ‘గతం’ మాత్రమే ఎంపిక అయ్యింది. గత ఏడాది ఈ విభాగంలోఎఫ్ 2 సినిమా నిలిచింది. అంతకు ముందు ఏడాది అంటే 2018 లో మహానటిని అంతకు ముందు రెండు సంవత్సరాలు బాహుబలి రెండు పార్ట్ లు స్క్రీనింగ్ అయ్యి ఈ అవార్డును దక్కించుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఫిల్మ్ ఫెస్టివల్ ను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. వచ్చే నెల 16 నుండి 21 వరకు ఈ ఫెస్టివల్ జరుగబోతుంది. 26 ఫీచర్ ఫిల్మ్స్ 21 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ను స్క్రీనింగ్ చేయబోతున్నారు.

Share via
Copy link