Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎన్టీఆర్30 హీరోయిన్ కొత్త పుకారు

ఎన్టీఆర్30 హీరోయిన్ కొత్త పుకారు

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా ఆకట్టుకుంది. పైగా త్రివిక్రమ్ గత సినిమా అల వైకుంఠపురంలో సినిమా దుమ్ము రేపే వసూళ్లను నమోదు చేసింది. ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న అల వైకుంఠపురంలో సినిమా తర్వాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోతున్న మూవీ హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా మరో కొత్త పుకారు షికారు చేస్తోంది. సాహో సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన ముద్దుగుమ్మ శ్రద్ద కపూర్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు నటించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ మార్చి లో ఆ సినిమాను పూర్తి చేయబోతున్నాడు. ఆ వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ విభిన్నమైన పాత్రలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ తో యాస మాట్లాడించిన త్రివిక్రమ్ ఈ సినిమాలో ఏం చేయబోతున్నాడో చూడాలి.

Share via
Copy link