Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ మచ్చల్ని కాదు నివేద సహజ అందాన్ని గట్స్ ని చూడాలి

ఆ మచ్చల్ని కాదు నివేద సహజ అందాన్ని గట్స్ ని చూడాలి

బాహ్య సౌందర్యం.. అంతఃసౌందర్యం.. దేనికి ఎక్కువ ఆకర్షితులవుతారు? అంటే తొలిగా బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడతారు. తర్వాత అంతఃసౌందర్యాన్ని మంచి మనసును అంతకుమించి ఇష్టపడేవారే ఎక్కువవుతారు. నిజానికి ఇంతకుముందు పలువురు అందాల కథానాయికలు తమ సహజ అందాన్ని ఆవిష్కరిస్తూ లోపాల్ని కూడా బహిర్గతం చేసేందుకు ఇష్టపడడంతో ఆ ఫోటోలు అంతర్జాలంలో వాడి వేడి చర్చకు తావిచ్చాయి. అందాల చందమామగా పాపులరైన కాజల్ ముఖారవిందంపై మచ్చలు ఉన్న ఫోటో అప్పట్లో సంచలనమే సృష్టించింది. అయితే తన అంతః సౌందర్యం చూపించేందుకు ప్రతిదీ బహిర్గతం చేస్తానని నేచురల్ అందం చూడమని అభిమానుల్ని కాజల్ కోరింది.

ఇప్పుడు అందాల నివేతా థామస్ స్కిన్ స్పాట్స్ (మచ్చలు) అంతే హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది. నివేద చేతులపై పింక్-ఎరుపు మచ్చలతో లోపం బహిర్గతమైంది. వాక్సింగ్ ఇతర అందం పెంపొందించే ప్రక్రియల వల్ల ఆ మచ్చలు ఏర్పడ్డాయా? అని ఆమెను అడుగుతూ చాలా మంది ఆమె మచ్చలపై వ్యాఖ్యానించడం ప్రారంభించారు. కానీ మనుషులకు అలాంటి మచ్చలు ఉండటం సర్వసాధారణమని తనకు మద్దతునిచ్చేవారి సంఖ్యా అపరిమితంగా ఉంది.

చాలా మంది మహిళలు నివేద తరహాలోనే మచ్చలను కలిగి ఉన్నామని అంగీకరిస్తూ…సామాన్యుల కంటే నివేద ఏమీ భిన్నంగా లేదని సంతోషించారు. వాస్తవానికి కెరెటిన్ అనే వర్ణద్రవ్యం వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి.

తాను ఇలా కెరాటోసిస్ తో కాఫీ షాప్ లో ప్రత్యక్షమై బహిరంగంగా తన చేతులను ప్రదర్శించి డేర్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. తాను ప్రతిదీ ఓపెన్ గా ఉండేందుకు ఇలా చేశానని కూడా నివేతా థామస్ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు. కాబట్టి ఇది అసాధారణమైన పరిస్థితి కాదు. ఈ రోజుల్లో పిక్చర్-పర్ఫెక్ట్ బ్యూటీ ప్రాసెస్డ్ మచ్చలేని చర్మ సౌందర్యం కంటే అభిమాన జనం సహజ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల సోషల్ మీడియా వినియోగదారులలో చాలామంది ఆమె చర్మ లోపాలతోనూ అద్భుతంగా కనిపిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. అన్నట్టు నివేద థామస్ మలయాళీ అమ్మాయే అయినా తనతో ఒకసారి తెలుగులో మాట్లాడితే ఇంత స్వీట్ గా తెలుగమ్మాయిల్ని మించి గొప్పగా తెలుగు మాట్లాడుతున్నారని అంగీకరించి తీరాల్సిందే. టాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూల్లో ఎంతో చక్కని తెలుగు మాట్లాడుతూ ప్రతిసారీ ఆశ్చర్యపరచడం నివేదకే తెలిసిన విద్య.

Share via
Copy link