Templates by BIGtheme NET
Home >> Cinema News >> భార్యామణి బర్త్ డే సెలబ్రేషన్స్ లో యూత్ స్టార్..!

భార్యామణి బర్త్ డే సెలబ్రేషన్స్ లో యూత్ స్టార్..!

టాలీవుడ్ యువ హీరో నితిన్ తన ప్రియసఖి షాలిని ని వివాహం చేసుకొని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ టైంలో జులై 26న వీరి వివాహం కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితులు అతిథుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన సతీమణి పుట్టినరోజు వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేశాడు. పెళ్లి తర్వాత వచ్చిన భార్యామణి బర్త్ డేని క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి జరిపినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి హాస్యనటుడు వెన్నెల కిషోర్ – ‘భీష్మ’ దర్శకుడు వంశీ కుడుముల కూడా హాజరయ్యారు. వెన్నెల కిషోర్ దీనికి సంబంధించిన ఓ ఫోటోని సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేస్తూ షాలిని కి బర్త్ డే విషెస్ తెలియజేసాడు. ఇందులో నితిన్ – షాలిని దంపతులతో పాటు వెన్నెల కిషోర్ – వంశీ కుడుముల కనిపిస్తున్నారు.

ఇంతకముందు నితిన్ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘నా లవ్లీ వైఫ్ కి బర్త్ డే విషెస్.. నేను నీతో గడిపిన సమయాలు నా రోజులోని సంతోషకరమైన క్షణాలు’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి తన సతీమణితో కలసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇక సినిమాల విషయానికొస్తే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నాడు. అలానే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమా చేస్తున్నాడు. వీటితోపాటు మేర్లపాక గాంధీతో కలిసి ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. ఇవి పూర్తైన తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే సినిమా చేయనున్నాడు.

Share via
Copy link