Templates by BIGtheme NET
Home >> Cinema News >> నిహారిక.. ఈసారి ఈచోట మమేకమైన క్షణం

నిహారిక.. ఈసారి ఈచోట మమేకమైన క్షణం

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గుంటూరు ఐజీ వారసుడు టెకీ చైతన్య జొన్నలగడ్డను వివాహమాడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఈ పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. పెళ్లి సందడికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత నిహారిక – చైతన్య జోడీ మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేసారు. ఈ విహార యాత్రకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని ఫోటోల్ని నిహారిక స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా ఈ భామ మరో స్పెషల్ ఫోటోని షేర్ చేసింది.

నేవీ బ్లూ డెనిమ్ టాప్ లో నిహారిక సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. బటన్ డిజైన్డ్ డెనిమ్ టాప్ తనకు పర్ఫెక్ట్ యాప్ట్ అవ్వడమే గాక తన అందాన్ని హాట్ నెస్ ని ఎలివేట్ చేసింది. ఈ లుక్ కెవ్వు కేక! అంటూ ఫ్యాన్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. `ఈసారి ఈ చోట..!` అంటూ చక్కని క్యాప్షన్ తో ఈ ఫోటోని సోషల్ మీడియాల్లో రివీల్ చేసింది నిహారిక. హబ్బీతో ప్రతి ఆనంద క్షణాల్ని ఆస్వాధిస్తూ నిహారిక సంతోషంగా కనిపిస్తోంది. ఇక నెక్ట్స్ ఏంటి? అంటే.. తిరిగి నిహారిక నటిగా కెరీర్ ని సాగిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంటుంది.

Share via
Copy link