Templates by BIGtheme NET
Home >> Cinema News >> నాగ్ కూడా వచ్చే ఏడాది మూడు

నాగ్ కూడా వచ్చే ఏడాది మూడు

కరోనా కారణంగా ఈ ఏడాదిని మిస్ అయిన యంగ్ హీరోలు పలువురు వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. నాని శర్వానంద్ తో పాటు పలువురు హీరోలు మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెడుతున్నారు. పవన్ కళ్యాన్ చిరంజీవి వంటి స్టార్స్ కూడా వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు విడుదల చేసేలా కనిపిస్తున్నారు. సీనియర్ హీరో నాగార్జున కూడా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఉన్నాడు అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. మరో వైపు ప్రవీణ్ సత్తారు మూవీని నాగార్జున చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మరో వైపు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాను కూడా నాగ్ చేసేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే నెలలో బంగార్రాజు సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఖచ్చితంగా ఈమూడు సినిమాలు వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయంటూ అక్కినేని ఫ్యామిలీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా నాగార్జున చాలా ఏళ్ల తర్వాత హిందీలో నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తానికి వచ్చే ఏడాదిలో నాగ్ కనీసం మూడు సినిమాలు అయినా ప్రేక్షకుల ముందుకు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. 2020లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేక పోవడంతో నాగ్ వచ్చే ఏడాది మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Share via
Copy link