Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహేష్ ఫ్యాన్స్ కొత్త అధ్యక్షుడిగా అక్కినేని హీరో!

మహేష్ ఫ్యాన్స్ కొత్త అధ్యక్షుడిగా అక్కినేని హీరో!

మహేష్ సినిమా రిలీజవుతోందంటే కృష్ణ- మహేష్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉంటుందా? థియేటర్ల ముందు ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి కటౌట్లు నిలబెట్టి నానా హంగామా చేస్తారు. మెగా నందమూరి ఫ్యాన్స్ తరహాలోనే ఘట్టమనేని ఫ్యాన్ బలం చిన్నదేమీ కాదు. మరి అలాంటి అభిమానుల బృందానికే అధ్యక్షుడయ్యే అవకాశం వస్తే ఏమాత్రం వదిలి పెట్టనని అంటున్నాడు నాగచైతన్య. నిజమే.. ఈ అక్కినేని హీరో మహేష్ కి వీరాభిమాని అట. పైగా మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ కే అధ్యక్షుడిగా సెటిలైపోయాడన్నదే `థాంక్యూ` మూవీలో ఆసక్తికర ఎలిమెంట్.

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్.కె తెరకెక్కిస్తున్న `థాంక్స్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అబిడ్స్ లోని రామకృష్ణ సినిమా హాల్ లో చిత్రీకరణ సాగుతోంది. కథానాయకుడు నాగ చైతన్యపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మహేష్ వీరాభిమాని అభిరామ్ గా నాగచైతన్య కనిపించనున్నారు. అభిరామ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా కనిపిస్తారట. మహేష్ తో ఫ్యాన్ అధ్యక్షుడు అభిరామ్ బ్యానర్లు రిలీజ్ వేళ థియేటర్ల ముందు దర్శనమిస్తున్నాయి మరి.

మనం లాంటి క్లాసిక్ ని అక్కినేని కాంపౌండ్ కి అందించిన విక్రమ్ కె ఈ చిత్రానికి దర్శకుడు. అతడు మరో హిట్ ని చైతన్యకు అందించాలన్న పంతంతో ఉన్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. అవికా గోర్ మరో నాయిక. దిల్ రాజు నిర్మిస్తున్నారు. చైతన్య డెబ్యూ `ఏమాయ చేశావే` చిత్రాన్ని నిర్మించిన మహేష్ సోదరి మంజుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బివిఎస్ రవి కథ అందించారు.

Share via
Copy link