Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైరల్ అవుతున్న ఇస్మార్ట్ భామ ప్రమోషన్ పిక్..!

వైరల్ అవుతున్న ఇస్మార్ట్ భామ ప్రమోషన్ పిక్..!

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వన్నెల దొరసాని నభా నటేష్. చూడగానే ఆకట్టుకునే అందం ఈ కన్నడ ముద్దుగుమ్మ సొంతం. తన క్యూట్ ఎక్సప్రెషన్స్ తో.. అంతే క్యూట్ నటనతో అలరిస్తోంది. నభా తన ఫస్ట్ సినిమాతోనే కుర్ర హృదయాలను కొల్లగొట్టి తెలుగు స్టార్ హీరోల దృష్టిని తన వైపు తిప్పుకుంది. బేసిగ్గా నభా కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినా తెలుగులో ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ.. వరుస సినిమాలతో ఇక్కడే సెటిల్ అవ్వాలనే ప్రయత్నం చేస్తోంది. గతేడాది డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి యువతను పరేషాన్ చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’లో అమ్మడి నటనతో పాటు అందాలు కూడా హైలైట్ అయ్యాయని చెప్పాలి. అమ్మడి డేర్ చూసి స్టార్ హీరోలు సైతం వారి సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు.

అయితే ఈ ఏడాది మాస్ రాజా రవితేజతో కలిసి డిస్కోరాజా సినిమాలో మెరిసింది. కానీ ఆ సినిమా బోల్తా కొట్టడంతో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలకు రెడీ అయింది. ఇక సోషల్ మీడియా వేదికగా హీరోహీరోయిన్లు తమ సినిమాను వివిధ రకాలుగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్లలో విడుదల కాబోతుంది. అందుకే తాజాగా ఈ భామ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో.. ఇంకా విడుదలకు మూడు రోజులే టైం ఉంది. అందరూ టికెట్స్ బుక్ చేసుకున్నారా లేదా..? అంటూ ఎక్సయిట్మెంట్ తో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో నభాతో పాటు హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదేగాక అమ్మడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ అనే సినిమాలో కూడా నటిస్తుంది.

Share via
Copy link