Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు..!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కూడా రిలీజ్ డేట్ ఇచ్చేశాడు..!

అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అఖిల్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మరియు ‘మనసా మనసా’ లిరికల్ సాంగ్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. టాలీవుడ్ ఈ మధ్య దర్శక నిర్మాతలు వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో బ్యాచిలర్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని జూన్ 19న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ అందమైన పోస్టర్ ని వదిలారు. ఇందులో అఖిల్ – పూజా జంట ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. నిజానికి సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో జూన్ కు వాయిదా వేసుకున్నారు.

సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్న అఖిల్ కి ఈ రిలీజ్ డేట్ కూడా కలిసొచ్చేలా ఉంది. సోలోగా వస్తుండటంతో వసూళ్లపరంగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

Share via
Copy link