Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిబిలో స్కిన్ షో కు నేను ఒప్పుకోలేదు.. అందుకే హారిక చేసింది

బిబిలో స్కిన్ షో కు నేను ఒప్పుకోలేదు.. అందుకే హారిక చేసింది

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో మోనాల్ గజ్జర్ ఒక ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమెకు ప్రేక్షకుల నుండి ఓట్లు రాకున్నా కూడా నెగ్గుకు వచ్చింది అంటూ సోషల్ మీడియా టాక్. షో నిర్వాహకులు చాలా సార్లు ఆమెను సేవ్ చేస్తూ వచ్చారు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇక మోనాల్ కాస్ట్యూమ్స్ గురించి ఆమె ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో పలు రకాల ప్రచారాలు జరిగాయి. కొందరు ఆమె వేసుకున్న డ్రస్ ను ట్రోల్ చేశారు. మరీ ఇంత ఎక్స్ పోజింగ్ ఏంటో అంటూ విమర్శలు చేశారు. ఎవరు ఏం చేసినా కూడా తన పంథాలో తాను ముందుకు వెళ్లింది. బయటకు వచ్చిన తర్వాత మోనాల్ చాలా బిజీ అయ్యింది. ఎంత బిజీ అంటే ఏకంగా హైదరాబాద్ కు షిప్ట్ అవ్వాలి అనుకునేంత.

ఒక డాన్స్ షో కు జడ్జ్ గా చేస్తూ ఉంది. ఇప్పటికే అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఒకటి రెండు వెబ్ సిరీస్ ల్లో కూడా ఈ అమ్మడిని సంప్రదిస్తున్నారు. మొత్తానికి ఈమె హంగామా మామూలుగా లేదు. ఈమద్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూనే వచ్చింది. తాజాగా ఈ అమ్మడు తాను హౌస్ లో వేసుకున్న డ్రస్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడు కూడా నేను నాకు కంఫర్ట్ అనిపించిన డ్రస్ లు మాత్రమే వేసుకున్నాను. నాకు షో ఆరంభం సమయంలో పొట్టి డ్రస్ లు వేసుకోవాలంటూ సూచించారు. అందుకు నో చెప్పాను. హారికకు ఆ ఆఫర్ ఇచ్చారు. ఆమె అందుకు ఓకే చెప్పింది. ఆమె పొట్టి డ్రస్ లు కంఫర్ట్ కాబట్టి వేసుకుందని మోనాల్ వ్యాఖ్యలు చేసింది. డ్రస్ లు ఎలాంటివి వేసుకోవాలని కూడా బిగ్ బాస్ వారు సూచిస్తారు అంటూ మోనాల్ వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చేసింది.

Share via
Copy link