Templates by BIGtheme NET
Home >> Cinema News >> షూటింగ్ లోనే కుప్పకూలిన బాలీవుడ్ స్టార్!

షూటింగ్ లోనే కుప్పకూలిన బాలీవుడ్ స్టార్!

బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి షూటింగ్ చేస్తుండగానే కుప్ప కూలారు. అనారోగ్యానికి గురైన మిథున్.. చిత్రీకరణ మధ్యలోనే కిందపడిపోయారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. తాజాగా.. ఈ షూటింగ్లో పాల్గొన్న నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించిన మితున్.. షూటింగ్లో కుప్పకూలిపోయాడు. దీంతో అర్ధంతరంగా చిత్రీకరణ నిలిపి వేశారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఇలా జరిగిందని యూనిట్ తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ వివేక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మిథున్ పాత్రపై పెద్ద యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నాం. ఈ క్రమంలో మిథున్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడు.’’ అని తెలిపారు. అయితే.. కాసేపు విశ్రాంతి తర్వాత మిథున్ మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. దీనిపై డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ‘‘సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఆ పరిస్థితుల్లో కనీసం నిల్చోలేరు. కానీ.. మిథున్ కొద్దిసేపు తీసుకొని విశ్రాంతి మళ్లీ వచ్చి షూట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా షూట్ చేస్తారని నేను అస్సలు ఉహించలేను. కానీ మిధున్ చేశాడు. అందుకే అతను సూపర్ స్టార్ అయ్యాడు.’’ అని డైరెక్టర్ అన్నారు.

తన నాలుగు దశబ్దాల సినిమా కెరీర్లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదని మిథున్ తనకు చెప్పాడని డైరెక్టర్ వివేక్ అన్నారు. ‘మీ షూటింగ్ నా వల్ల ఆగిపోలేదు కదా..?’ అని మిథున్ నన్ను ఇటీవల అడిగారని అది విని తనకు నిజంగా ఆశ్యర్యం వేసిందన్నారు. ఇంతటి అంకితభావంతో పనిచేసేవాళ్లను ఈ తరం నటుల్లో తాను ఎవర్నీ చూడలేదు అన్నారు వివేక్. ‘మిథున్చాలా కష్టజీవి. ప్రతిరోజు షూట్కు వచ్చినప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. తన పని తాను వేగంగా చేస్తాడు. మిథున్ చక్రవర్తి లాంటి నటుడు ఉండటం ఏ మూవీ యూనిట్కైనా ఆస్తి వంటింది.’ అని డైరెక్టర్ వివేక్ పేర్కొన్నారు. కశ్మీరీ హిందువుల దుస్థితి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఒక చిన్న మెట్టులాగా ఉపయోగపడుతుందని వివేక్ అభిప్రాయపడ్డారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ 2021 లో విడుదల కానుంది.

Share via
Copy link