Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2021 సంక్రాంతి ఫైట్ కి `మాస్టర్` రెడీ.. సెన్సార్ U/A

2021 సంక్రాంతి ఫైట్ కి `మాస్టర్` రెడీ.. సెన్సార్ U/A

2020లో అత్యంత క్రేజీగా అభిమానుల్లో ట్రెండ్ అయిన టైటిల్ `మాస్టర్`. దళపతి విజయ్ `సర్కార్` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న సినిమాగా ఈ మూవీ గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగింది. ఖైదీ లాంటి సంచలన విజయంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు మార్మోగడంతో ఈ కాంబినేషన్ సంథింగ్ స్పెషల్ గా చర్చల్లోకొచ్చింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో నుంచి మాస్టర్ రిలీజ్ కి వస్తోంది. అత్యంత క్రేజీగా సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వార్ కి తెరలేపనుందన్న ప్రచారం మొదలైంది. ఈ చిత్రం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తాను అత్యంత క్రూరమైన విలన్ గా కనిపిస్తానని చెప్పారు. కాలేజీ డ్రామా రక్తి కట్టిస్తుందని వెల్లడించారు. ఈ చిత్రం ఏడాది క్రితం ప్రకటించినప్పటి నుంచీ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. దీపావళి సందర్భంగా టీజర్ విడుదల చేయగా అది అంతర్జాలంలో సునామీ సృష్టించింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యుఏ సర్టిఫికెట్ ని ప్రదానం చేసిందని మాస్టర్ నిర్మాతలు స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. అతి త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటించే వీలుందని తెలిపారు.

తాజాగా యుఏ మార్క్ తో `మాస్టర్` పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్మాణ సంస్థ XB ఫిల్మ్ క్రియేటర్స్ త్వరలో కలుద్దాం అంటూ ట్విస్టివ్వడంతో సంక్రాంతి రిలీజ్ ఇంకా కన్ఫామ్ కాలేదు. అయితే కచ్ఛితంగా సంక్రాంతికే రిలీజవుతుందన్న అంచనా అభిమానుల్లో బలంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన మాళవిక మోహనన్ నాయికగా నటించింది. ఆండ్రియా జెరోమియా- శాంతను భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2020 వేసవిలో రిలీజ్ కావాల్సి ఉన్నా మహమ్మారి కారణంగా విడుదలవ్వలేదు.

Share via
Copy link