Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎన్టీఆర్ సినిమాలో ‘మన్మథుడు’బ్యూటీ.. ఎన్నాళ్లకెన్నాళ్లకూ..?!

ఎన్టీఆర్ సినిమాలో ‘మన్మథుడు’బ్యూటీ.. ఎన్నాళ్లకెన్నాళ్లకూ..?!

‘అరవింద సమేత’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మూవీ కోసం ‘‘అయిననూ పోయిరావలె హస్తినకు’’ అనే టైటిల్ ను ఫిలిం చాంబర్లో రిజిష్టర్ చేయించారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన మరో లేటెస్ట్ అప్ డేట్ కూడా తెరపైకి వచ్చింది. ఇది మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

అదే.. నాగార్జున ‘మన్మథుడు’ సినిమాలో నటించిన హీరోయిన్ గురించి. ముచ్చటగా మూడు సినిమాల్లో కనిపించి నటనకు టాటా చెప్పేసి వెళ్లిపోయిన అన్షు.. ఈ చిత్రంలో నటించనుందని ప్రచారం సాగుతోంది. ‘మన్మథుడు’ సినిమాతోనే టాలీవుడ్కి పరిచయం అయ్యింది అన్షు. ఈ సినిమాలో ఈ బ్యూటీ చేసిన సాఫ్ట్ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ రెండో సినిమా ‘రాఘవేంద్ర’లో హీరోయిన్ గా నటించింది. అయితే.. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. చాలా కాలం తర్వాత శివాజి-లయ-భూమిక నటించిన ‘మిస్సమ్మ’లో అతిథిపాత్రలో మెరిసిందీ అమ్మడు. అదే తన చివరి చిత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు తెరపై మెరిసింది లేదు.

ఇప్పుడు.. ఆమెను మరోసారి తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నాడట త్రివిక్రమ్. ఎన్టీఆర్ సినిమాలో ఓ కీలకపాత్రను ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో.. రానా-పవన్ కళ్యాణ్ సినిమాతో త్రివిక్రమ్ (స్క్రీన్ప్లే డైలాగ్స్) బిజీగా ఉన్నారు. వీరిద్దరూ ఫ్రీ అయిన తర్వాత.. తమ చిత్రం పట్టాలెక్కనుంది.

Share via
Copy link