Templates by BIGtheme NET
Home >> Cinema News >> కాస్టింగ్ కౌచ్.. నాకు ఇలా జరిగింది : హీరోయిన్

కాస్టింగ్ కౌచ్.. నాకు ఇలా జరిగింది : హీరోయిన్

గతంలో కాస్టింగ్ కౌచ్ లేపిన దుమాారం అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీలో వేళ్లూనుకున్న ఈ పద్ధతి వల్ల తమను తాము కోల్పోయామని పలువురు నటీమణులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఒక ఉద్యమం కూడా సాగింది. ఆ తర్వాత చల్లారినప్పటికీ.. అప్పుడప్పుడూ ఈ విషయం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా.. హీరోయిన్ మాళవిక శర్మ ఈ విషయంపై స్పందించింది.

రవితేజ సరసన నటించి ‘నేల టిక్కెట్టు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవిక శర్మ. తన అందంతో మెస్మరైజ్ చేసే ఈ అమ్మడు.. సంక్రాంతికి రామ్తో కలిసి థియేటర్స్లో సందడి చేయబోతోంది. వీరు జంటగా నటించిన ‘రెడ్’ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న మాళవిక.. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది.

ఇప్పటికే పలువురు హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ కారణంగా మోసపోయామని ఓపెన్ అవుతుండగా.. మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఈ అంశంపై మీ స్పందన ఏంటని మాళవిక శర్మను ప్రశ్నించగా.. ‘నాకైతే అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు’ అని చెప్పింది. మరి ఇతరులకు ఎదురైందా? అని అడగ్గా.. అది తనకు తెలియదని చెప్పింది మాళవిక.

కాగా.. మాళవిక-రామ్ నటించిన ‘రెడ్’ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరో రామ్తో పాటు హీరోయిన్ మాళవికను డిఫరెంట్గా ప్రెజెంట్ చేశారని టాక్. ఈ మూవీలో రామ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించారు. నివేదా పేతురాజ్ మాళవికా శర్మ అమృతా అయ్యర్ ఈ మూవీలో సందడి చేయనున్నారు. స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రానికి.. మణిశర్మ సంగీతం అందించారు. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ముగిసింది. కానీ.. థియేటర్లలోనే విడుదల చేయాలని ఇన్నాళ్లూ ఎదురు చూశారు దర్శకనిర్మాతలు.

Share via
Copy link