Templates by BIGtheme NET
Home >> Cinema News >> మలైకా యోగా.. కోబ్రా భంగిమ ఇదిగో

మలైకా యోగా.. కోబ్రా భంగిమ ఇదిగో

గత కొంతకాలంగా బాలీవుడ్ హాట్ గాళ్ మలైకా అరోరా యోగా టీచర్ గా మారి తన అభిమానులకు సోషల్ మీడియాల్లో రకరకాల టిప్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రకాల అసనాలకు సంబంధించిన రకరకాల భంగిమలతో ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేసి ఆ అసనం ప్రయోజనం ఏమిటో వివరించారు.

శిల్పాశెట్టి.. సోఫీ చౌదరి తరహాలోనే మలైకా యోగా గురువుగా మారి అభిమానులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకోవడం హీట్ పెంచుతోంది. ఇంతకుముందు గోవా ట్రిప్ నుంచి వరుసగా యోగా క్లాసులతో వేడి పెంచిన మలైకా ఇప్పటికీ వాటిని కంటిన్యూ చేస్తూ ఇన్ స్టా వేదికగా యంగేజ్ చేస్తున్నారు.

తాజాగా కోబ్రా అసనాన్ని పరిచయం చేశారు. ఈ అసనం వల్ల ఆస్త్మా సహా ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇక మలైకా యోగా భంగిమను అభిమానులు ఫాలో చేస్తే చాలావరకూ వైద్యులకు ఫీజులు ధారపోయాల్సిన పనే ఉండదు. యోగాతో ఆరోగ్యం .. అందం సులువుగా సాధ్యమవుతుంది. రెగ్యులర్ లైఫ్ ఒత్తిళ్ల నుంచి బయటపడే వీలుంటుంది. 50 కి చేరువ అవుతున్నా మలైకా ఇంకా 30 ఏజ్ గాళ్ లా మంత్రముగ్ధం చేస్తోంది అంటే ఆ అందం వెనక అసలు రహస్యం ఏమిటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

Share via
Copy link