Templates by BIGtheme NET
Home >> Cinema News >> విలన్ గా కార్తికేయ ఇరగ్గొట్టేశాడట!

విలన్ గా కార్తికేయ ఇరగ్గొట్టేశాడట!

టాలీవుడ్ యువ కథానాయకుల రేసులో కార్తికేయ కూడా కనిపిస్తాడు. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటి ఉన్న కార్తికేయ ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. ఈ కుర్రాడు విలన్ వేషాలకి కూడా బాగుంటాడని అప్పుడే అంతా అనుకున్నారు. అనుకుంటున్నట్టుగానే ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ నటించాడు .. మెప్పించాడు. అలా ఆ సినిమాలో ఆయన వేసిన విలన్ వేషం .. ఏకంగా తమిళంలో అజిత్ సినిమాలో విలన్ గా అవకాశాన్ని తెచ్చిపెట్టింది.

అజిత్ హీరోగా తమిళంలో ‘వలిమై’ సినిమా రూపొందుతోంది. హెచ్ వినోద్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తమిళనాట అజిత్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అక్కడ ఆయనకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. అజిత్ సినిమాలో విలన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండాలని వాళ్లు కోరుకుంటరు. అంతకు ఎంతమాత్రం తగ్గినట్టుగా కనిపించినా వాళ్లు ఒప్పుకోరు. అలాంటి అజిత్ అభిమానులు కార్తికేయను విలన్ పాత్రకి అంగీకరించడం విశేషం.

ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ .. అందువలన భారీ ఫైట్లు .. ఛేజింగులు గట్రా బాగానే ఉన్నాయట. ఆ యాక్షన్ సీన్స్ లో అజిత్ తో పోటీపడి కార్తికేయ చేశాడని అంటున్నారు. అజిత్ చాలావరకూ డూప్ ను ఒప్పుకోడనే సంగతి తెలిసిందే. అందువలన సహజంగా అనిపించడం కోసం కార్తికేయ కూడా రిస్కీ ఫైట్స్ చేశాడనే అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. హుమా ఖురేషి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో దిగిపోనుంది.

Share via
Copy link